తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వివరాలు తెలిపిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు

Telangana cabinet: సోనియా గాంధీని ఆహ్వానించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని..

Ponguleti Srinivas Reddy

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. హైదరాబాద్ లోని సచివాలయంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు (జూన్ 2న) కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అకాల వర్షాలు, పంట నష్టంపై కూడా క్యాబినెట్ లో చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని క్యాబినెట్ చెప్పింది. రైతులకు నష్టం జరగకుండా ధాన్యాన్ని పూర్తిగా కొనాలని ఆదేశించింది. సన్నవడ్లకు రూ.500 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. అలాగే తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని క్యాబినెట్ నిర్ణయించింది.

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు, ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మరమత్తులపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. మేడిగడ్డపై ఎన్డీఎన్ఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టుపై చర్చించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్డఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు.

వ్యవసాయం, విద్యా, ప్రజలకు ఇచ్చిన హామీల అమలే తమ ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు. అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇస్తామని చెప్పారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరతో సేకరిస్తున్నామని అన్నారు.

పాఠశాల, సాంకేతిక, హయ్యర్ ఎడ్యుకేషన్ లలో నాణ్యతలో మార్పు, తీసుకురావాలన్నద్దని ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. అమ్మ పాఠశాలల కమిటీలకు 600 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.

అతి తక్కువ కాలంలో ప్రజలతో ఛీకొట్టించుకున్న ప్రభుత్వం ఇదే- ఈటల రాజేందర్

ట్రెండింగ్ వార్తలు