వామ్మో వెండి..! బంగారాన్ని మించి రికార్డు స్థాయికి సిల్వర్ ధరలు, ఎందుకిలా?

సామాన్యులు ఎలాగూ బంగారాన్ని కొనలేని పరిస్థితి. కనీసం సిల్వర్ అయినా ఓ తులం కొందామంటే ధరలు దడ పుట్టిస్తున్నాయి.

Silver Price Rises : ఒకవైపు గోల్డ్ రేట్లు సామాన్యులను బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు సిల్వర్ రేట్స్ కామ్ గా పైపైకి వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ ప్రతి ఒక్కరూ గోల్డ్ వైపే చూస్తుంటే సందట్లో సడేమియాలా.. సిల్వర్ రేట్ భారీగా పెరిగింది. ఇప్పుడు గోల్డ్ ధరను మించి వెండి ధర దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. గత 4 రోజుల్లోనే కేజీ వెండి ధర దాదాపు 12వేల రూపాయలకు పైగా పెరిగి లక్ష మార్క్ ను క్రాస్ చేసింది. ఇవాళ కిలో వెండి ధర లక్ష 1000 రూపాయలు పలుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకం విలువ వీక్ కావడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వరుస ప్రకటనలు చేస్తుండటం ఎల్లో మెటల్ తో పాటు వెండి డిమాండ్ ను అమాంతం పెంచింది. దీంతో దేశీయ మార్కెట్ లో సిల్వర్ ధర సైకలాజికల్ లెవల్ లక్ష మార్కును క్రాస్ చేసి పైపైకి వెళ్తోంది. సామాన్యులు ఎలాగూ బంగారాన్ని కొనలేని పరిస్థితి. కనీసం సిల్వర్ అయినా ఓ తులం కొందామంటే ధరలు దడ పుట్టిస్తున్నాయి.

Also Read : ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయం!

ట్రెండింగ్ వార్తలు