CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్

CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సామాజిక న్యాయాన్ని చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సామాజిక న్యాయాన్ని చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ అధిక ప్రాధాన్యత వెనుకబడిన (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) వర్గాలకు ఇవ్వడాన్ని ఊటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై వైయస్సార్‌సీపీ తరఫున ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులతో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాల విడుదల.. అధికార పార్టీ అభ్యర్థులు వీరే

ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే వాతావరణం ఉండేది కాదని, అయితే దేవుడి దయతో తమకు దక్కిన అవకాశంతో తమ పార్టీలో ద్వారా తాము ఆ పని చేయగలుగుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని  గర్వంగా చెప్పుకుంటామని పేర్కొన్నారు. మొత్తం 18 మంది అభ్యర్థులను ఖరారు చేశామని అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులే ఉన్నారని జగన్ అన్నారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో ఓసీ వర్గాల వారికి టికెట్లు కేటాయించినప్పటికీ.. ఒక్కో వర్గం వారిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు టికెట్ రాని సామాజిక వర్గాలకు రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాము చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

Hindenburg Effect: పతనంలోనూ అదానీ రికార్డ్.. ఒక్క రిపోర్టుతో $120 బిలియన్ల నుంచి ఏకంగా $49 బిలియన్లకు వచ్చిన సంపద

‘‘ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదు. ఇంత పారదర్శకంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకు లంచాలకు తావులేకుండా పథకాలు అందిస్తున్నాం. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈరోజు మేం చేసింది మరొక ఎత్తు. పదవులు తీసుకున్న వారు యాక్టి‌వ్‌గా ఉండాలి. నేను చేయాల్సింది చేశాను, ఇవ్వాల్సింది ఇచ్చాను. ఇక ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్నవారు పార్టీకోసం ఏం చేయగలుగుతామోనన్న ప్రశ్న వేసుకోవాలి. పదవులు పొందుతున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాంకాక్షలు తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.

Meghalaya: ప్రధాని మోదీకి షాకిచ్చిన సీఎం.. ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరణ

అయితే పదవులు ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని, తక్కువ పదవులు ఉండడం వల్ల, అందరినీ సంతృప్తి పర్చలేకపోయామని జగన్ అన్నారు. ఆశావహులందరికీ చెప్పే రీతిలో చెప్పుకుంటూ, వారి కన్విన్స్‌ చేసుకుంటూ పోవాలని పార్టీ నేతలకు సూచించారు. ‘‘వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే అధికార పార్టీని స్థాపించాం. అధికారంలోకి వచ్చాం. దేవుడి దయవల్ల మంచి పరిపాలన కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 అన్నట్లు, వై నాట్‌ అన్నరీతిలో పరిపాలన కొనసాగుతోంది. గత ఎన్నికల్లో మెజార్టీ కంటే రాబోయే ఎన్నికల్లో మరింత మెజార్టీ సాధిస్తాం. మరింత మందికి మేలు చేస్తాం’’ అని జగన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు