Cyclone Jawad Alert : బలపడుతున్న జొవాద్ తుపాను- ఉత్తరాంధ్రలో హై అలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం  గంటకు 30కి.మీ వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 480 కి.మీ, గోపాలపూర్ కు 600 కి.మీ, పారదీప్ కు 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉందని ఆం

Cyclone Jawad Alert :  ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం  గంటకు 30కి.మీ వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 480 కి.మీ, గోపాలపూర్ కు 600 కి.మీ, పారదీప్ కు 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు.  రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని, రేపు ఉదయానికి(04-12-21) ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ రోజు తీరం వెంబడి గరిష్టంగా 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. రేపు ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.   రేపు తీరం వెంబడి గరిష్టంగా 80-90కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని కన్నబాబు తెలిపారు.

Also Read : Foreign Passengers : విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్‌లో ఉన్నారు-ఏపీ ప్రభుత్వం

ఉత్తరాంధ్ర జిల్లాలలో  సహాయక చర్యలకోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అదనంగా మరో నాలుగు బృందాలు ఈ రాత్రికి విశాఖ చేరుకుంటాయని ఆయన చెప్పారు. మత్స్యకారులు ఆదివారం వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళరాదని హెచ్చరించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.  రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Cyclone Jawad

ట్రెండింగ్ వార్తలు