Navneet Kaur Rana : షాద్‌న‌గ‌ర్‌ పీఎస్‌లో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆమె తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో షాద్ నగర్ పట్టణంలో

Navneet Kaur

Case Registered On Against Navneet Kaur: రంగారెడ్డి జిల్లా షాదన్ నగర్ పోలీస్ స్టేషన్ లో అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి నవనీత్ కౌర్ పై కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్థాన్ కు ఓటేసినట్లేనని ఆమె మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లెయింగ్ స్వ్కాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read : బీజేపీ మళ్లీ గెలిస్తే జరిగేది ఇదే, 400 సీట్లు అడుగుతున్నది అందుకే..- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆమె తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో షాద్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా రోడ్ షోలో నవనీత్ కౌర్ పాల్గొని ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్థాన్ కు ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యాలను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. దీంతో ఆయా సెక్షన్ల కింద రోడ్ షో అనుమతి తీసుకున్న బాధ్యులతోపాటు.. నవీత్ కౌర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: మాకు 15 సెకన్లు చాలు.. సరే అలాగే కానీయండి; నవనీత్, అసదుద్దీన్ మాటల యుద్ధం