Chiranjeevi : ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ

, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై చిరంజీవి స్పందించారు.

AP Assembly Election 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజుల సమయం ఉంది. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై చిరంజీవి స్పందించారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : Navneet Kaur Rana : షాద్‌న‌గ‌ర్‌ పీఎస్‌లో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. పిఠాపురంలో ప్రచారంపై స్పందిస్తూ.. రేపు పిఠాపురం వెళ్లడం లేదు. ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్ నన్ను పిలవలేదు. నేను పిఠాపురం ప్రచారానికి వెళ్తున్నట్లు బయట జరిగే ప్రచారమంతా అవాస్తవమని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న ప్రశ్నకు లేనని అన్నట్లుగా చిరంజీవి చేతులు ఊపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గుడ్ బై చెప్పినట్లేనని తెలుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు