Pacer Mohammed Shami bashes Sanjiv Goenka rallies behind KL Rahul
Shami on Sanjiv Goenka : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు మద్దతుగా అతడి టీమ్ఇండియా సహచరుడు మహ్మద్ షమీ మాట్లాడాడు. గోయెంకా చేసిన పని సరైనది కాదని చెప్పాడు.
క్రిక్‌బజ్‌తో షమీ మాట్లాడుతూ.. ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలంటూ సంజీవ్ గోయెంకాకు సూచించాడు. ‘గౌరవప్రదమైన టీమ్ ఓనర్ స్థాయిలో మీరు ఉన్నారు. మిమ్మల్నీ చూసి ఎంతో మంది నేర్చుకుంటారు. అలాంటి మీరు కెమెరాల ముందు హద్దులు దాటి ఆటగాడిని అవమానించడం బాలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం.’ అని అన్నాడు.
ఏదైనా చర్చించాలనుకుంటే డ్రెస్సింగ్ లేదా హోటల్ రూమ్‌లో కేఎల్ రాహుల్ తో మాట్లాడి ఉంటే సరిపోయేదని చెప్పాడు. మైదానంలో ఇలా చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని షమీ తెలిపాడు. ఇది టీమ్ గేమ్ అని. అన్ని రోజులు ఫలితాలు మనకు అనుకూలంగా రావని చెప్పాడు. ప్రతి ఒక్క ప్లేయర్‌కు గౌరవం ఉంటుందని, ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిదన్నాడు. గ్రౌండ్‌లో క్రికెటర్‌ను అవమానించడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటే మంచిది అని షమీ అన్నాడు.
Also Read : టీ20 ప్రపంచకప్ వేళ.. రిటైర్‌మెంట్ ప్రకటించిన డాషింగ్ ఓపెనర్
ఎస్ఆర్‌హెచ్‌తో ఓటమి తరువాత లక్నో ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడి పోయింది. ఇప్పటి వరకు లక్నో జట్టు 12 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో గెలిచింది. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచుల్లోనూ లక్నో గెలిచినప్పటికీ కూడా ఇతర జట్ల సమీకరణాల పై ఆధారపడాల్సి ఉంది.
Also Read: కోహ్లి మనిషి కాదురా అయ్యా.. రనౌట్ ఎలా చేశాడో చూశారా.. వీడియో వైరల్