TTD OSD : రేపు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు, భౌతికకాయానికి ప్రత్యేక ఇంజక్షన్

ఎనటమి విభాగంలో ఎమ్‌బామింగ్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు డాక్టర్‌ సుధాకర్‌. డాలర్ శేషాద్రి భౌతికకాయం పాడవకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ చేశామన్నారు.

Dollar Seshadri Dead Body : డాలర్ శేషాద్రి అంత్యక్రియలు 2021, నవంబర్ 30వ తేదీ మంగళవారం జరగనున్నాయి. ప్రస్తుతం డాలర్‌ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ఉంచారు. వైద్యులు ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత.. 12 గంటలకు రోడ్డు మార్గాన తిరుపతికి తరలించనున్నారు. ఎనటమి విభాగంలో ఎమ్‌బామింగ్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు డాక్టర్‌ సుధాకర్‌. డాలర్ శేషాద్రి భౌతికకాయం పాడవకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ చేశామన్నారు.

Read More : Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..

మంగళవారం ఉదయం ప్రజల సందర్శనార్ధం సిరిగిరి అపార్ట్‌మెంట్లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరుపతి గోవిందదామంలో అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. 2021, నవంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం ఉదయం 4 గంటలకు డాలర్ శేషాద్రికి గుండెపోటు వచ్చింది. అక్కడ ఉన్నవారు వెంటనే.. ఆయనను రామ్‌నగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు.

Read More : Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత

చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు డాలర్ శేషాద్రి. తుదిశ్వాస వరకు శ్రీవారి సేవలో తరించారారయన. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని కొనియాడారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. డాలర్ శేషాద్రి మరణం టీటీటీకి తీరని లోట అని, టీటీడీలో శేషాద్రి సేవలు అనిర్వచనీయమైనవి అని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.

ట్రెండింగ్ వార్తలు