Andhra pradesh : వైసీపీ ప్రభుత్వానికి గడప గడపకూ ఛీత్కారాలే : మాజీ మంత్రి

వైపీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలకు సత్కారాలు కాదు ఛీత్కారాలే ఎదురవుతున్నాయని మాజీ మంత్రి బంగారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ మాత్రం తమ నేతలకు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టటంపై వైసీపీ పరిస్థితి ప్రజల్లో ఏమేరకు ఉందోఅర్థం అవుతోంది అంటూ విమర్శించారు.

Andhra pradesh :  వైపీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలకు సత్కారాలు కాదు ఛీత్కారాలే ఎదురవుతున్నాయని మాజీ మంత్రి బంగారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ మాత్రం తమ నేతలకు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టటంపై వైసీపీ పరిస్థితి ప్రజల్లో ఏమేరకు ఉందోఅర్థం అవుతోంది అంటూ విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేక..నానా పాట్లు పడుతున్నారని ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారని అన్నారు.

ముందు గడప గడపకు వైసీపీ అని పేరు పెట్టి ఇప్పుడు అదే కార్యక్రమానికి పేరు మార్చి గడప గడపకు మన ప్రభుత్వం అని పేరు ఎందుకు మార్చారో దీన్ని బట్టే వైసీపీ పరిస్థితి ఏంటో తెలియజేస్తోందని..పార్టీ పేరు చెబితే ప్రజలు కనీసం గడప వద్దకు కూడా రానివ్వరని భయపడి కార్యక్రమం పేరు మార్చారంటూ ఎద్దేవా చేశారు. పార్టీ పేరు చెబితే అధికార యంత్రాంగాన్ని వాడుకోవటానికి ఉండదని అందుకే గడప గడపకు మన ప్రభుత్వం అని పేరు మార్చి ప్రజల ముందుకు అధికారుల్ని పెట్టి వెనక నాయకులు పోలీసుల సహాయంతో వెళుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు గడప గడపకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారని ప్రజల ఛీత్కారాలను భరించలేక నానా పాట్లు పడుతున్నారని అన్నారు బండారు సత్యనారాయణ. ‘ ఏం మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలో తెలియటంలేదు’అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే స్వయంగా చెబుతున్నారని దీన్ని బట్టి వైసీపీ పార్టీకి ప్రజల్లో ఎటువంటి దుస్థితి ఉందో తెలుస్తోంది అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గడప గడకు మన ప్రభుత్వం కాదు గడప గడపకు దిగజారుడు ప్రభుత్వం అని పేరు పెట్టుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆక్షేపించారు.

ట్రెండింగ్ వార్తలు