Peddireddy Ramachandra Reddy : జగన్ తాగు, సాగు నీరు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే… కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న చంద్రబాబు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

Peddireddy Ramachandra Reddy

Peddireddy Fired Chandrababu : ఎన్నికల హామీలు ఎన్నికల సమయంలో చూద్దాం లే, అనే స్థాయి నుండి అధికారంలోకి రాగానే అమలు చేయాలనే స్థాయికి రాజకీయాలను తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు.

పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి తాగు నీరు, సాగు నీరు అందించడానికి సీఎం వైఎస్ జగన్ మూడు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే… కోర్టుకు వెళ్లి వాటిని చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గాన్ని 30 ఏళ్లు ఒకే కుటుంబం పాలించినా ఎక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

CPI Narayana : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ తెరపైకి : నారాయణ

చిత్తూరు జిల్లా పుంగనూరులో రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రేషన్ కార్డుదారులకు మూడు కిలోల రాగులు, కిలో గోధుమ పిండి పంపిణీకి పుంగనూరు నుండి శ్రీకారం చుట్టారు. అలాగే పుంగనూరు మున్సిపాలిటీకి చెత్త సేకరణ కోసం ఇటీవల ప్రభుత్వం అందించిన 15 ఈ ఆటోలను మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు నుండి తనకు కారుమూరి నాగేశ్వరరావుతో అనుబంధం ఉందని తెలిపారు. ఈరోజు నుండి నెలాఖరు వరకు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు అవరమైన సేవలు అందిస్తారని వెల్లడించారు.

TSRTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ రెండు మార్గాల్లో ప్రత్యేక ఆఫర్

గోధుమ పిండి పంపిణీ ఈ పట్టణంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ సహకారంతో ముప్పై ఏళ్ల అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేసి చూపించామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని తెలిపారు.

చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకాలేదని ఎద్దేవా చేశారు. మహిళా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేస్తే…. సీఎం వైఎస్ జగన్ నాలుగు దశల్లో మొత్తం 26 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలన లో తేడాని ప్రజలు గమనించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు