Ukraine AP Students : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం జగన్ ఫోన్

యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని   సీఎం జగన్ మోహన్ రెడ్డి  కేంద్ర  విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు.  ఈమేరకు ఆయన ఈరోజు   కేంద్రమంత్రికి  ఫోన

Ukraine Andhra Students :  యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని   సీఎం జగన్ మోహన్ రెడ్డి  కేంద్ర  విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు.  ఈమేరకు ఆయన ఈరోజు   కేంద్రమంత్రికి  ఫోన్ చేసి మాట్లాడారు.  యుక్రెయిన్ లో   చిక్కుకుపోయిన  వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్రం అన్ని రకాలుగా చర్యలు తీసుకుటోందని కేంద్ర మంత్రి తెలిపారు.

యుక్రెయిన్ లోని   భారతీయులను, యుక్రెయిన్ పక్కన ఉన్నదేశాలకు  తరలించి అక్కడి నుంచి ప్రత్యేక   విమానాల ద్వారా భారత్   తీసుకు వచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. అంతుకు ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉన్నతస్ధాయి అధికారులతో యుక్రెయిన్ అంశంపై సమీక్ష నిర్వహించారు.

తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గోన్నారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.  యుక్రెయిన్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలని… ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలసి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
Also Read : War In Ukraine : ఎలాంటి భయం అవసరం లేదు..భారతీయులను క్షేమంగా తీసుకొస్తారు
వారిని రాష్ట్రానికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సీఎం అన్నారు. యుక్రెయిన్ లో ఉన్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని సీఎం అన్నారు.  అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు చేయటానికి రాష్ట్రం నుంచి తగిన సహకారానికి ఇవ్వాలని ఆయన అధికారును ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు