Flexi Clash In Tirupati : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేత

తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. మూడు రాజధానులే కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Tension in Amravati farmers’ padayatra : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులే కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

‘మీతో మాకు గొడవలు వద్దు… మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’ అంటూ తిరుపతి ప్రజల పేరిట నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. పాదయాత్రను నీరు గార్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు.

Firing In Wedding Ceremony : పెళ్లి జరుగుతుండగా జై శ్రీరామ్ అంటూ కాల్పులు..ఒకరు మృతి

తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం లోపు పాదయాత్ర అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. అలిపిరి వద్ద గల గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుపతి యాత్ర ముగించే యోచనలో రైతులు ఉన్నారు. శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం అమరావతి రైతుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 500 మంది రైతులకు రెండు, మూడు విడతలుగా దర్శనం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

అమరావతి పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అడ్డుపడుతోందని పిటిషన్‌లో రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ హైకోర్టుకు వెల్లడించారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతివ్వకుండా పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారని పేర్కొన్నారు.

Flexi In Tirupati : తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం….అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే

డీజీపీ,, మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని కోర్టుకు వెల్లడించారు. సభకు అనుమతి ఇవ్వాలా?…వద్దా? అనేది నిర్ణయించాల్సింది జిల్లా ఎస్పీ అని, అలాంటిది సభపై ఓ డీఎస్పీ అధికారి నిర్ణయం ఎలా తీసుకుంటారని న్యాయవాది లక్ష్మినారాయణ రిట్ పిటిషన్‌లో ప్రశ్నించారు. అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది.

ట్రెండింగ్ వార్తలు