Chicken : మాంసం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధర

కార్తీకమాసం కావడంతో మాంసం కొనుగోళ్లు చాలా తగ్గాయి. సాధారణ నెలల్లో కస్టమర్లతో చికెన్ షాపులు కళకళలాడేవి.. కానీ కార్తీకమాసం ప్రారంభం నుంచి కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.

Chicken : కార్తీకమాసం కావడంతో మాంసం కొనుగోళ్లు చాలా తగ్గాయి. సాధారణ నెలల్లో కస్టమర్లతో చికెన్ షాపులు కళకళలాడేవి.. కానీ కార్తీకమాసం ప్రారంభం నుంచి కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో చాలామంది మాంసం ముట్టరు. దీని కారణంగానే మాంసం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. దీంతో చికెన్ రేటు దిగొచ్చింది. కేజీ చికెన్ రూ.170కే లభిస్తుంది. ధర తగ్గినా కస్టమర్లు రావడం లేదని షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.

చదవండి : Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చ

ఇక కార్తీకమాసంలో మాంసం కొనుగోళ్లు తగ్గుతాయనే అవగాహనా లేకుండా బ్రాయిలర్ కోళ్లు పెంపకం చేపట్టిన వారు నష్టపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే విషయంపై రైతులు మాట్లాడుతూ కోడిని ఒక సైజు వరకే పెంచాలని ఆ సైజు రాగానే అమ్మేయాలని.. ఆలా అమ్ముకోకుండా ఉంచితే దానికి మేత దండగ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : Chicken Salad Benefits : చికెన్‌ సలాడ్‌ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండీ..

కార్తీకమాసం మొత్తం మాంసం మార్కెట్ డల్‌గానే ఉంటుందని చెబుతున్నారు. ఇతర మాంసపు ఉత్పత్తులతో పోల్చుకుంటే కోళ్ల పెంపకం దారులు ఈ నెలలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కేజీ చికెన్ రూ.170కి రావడం నాలుగు నెలల కాలంలో ఇదే కనిష్టం.

ట్రెండింగ్ వార్తలు