Chicken Salad Benefits : చికెన్‌ సలాడ్‌ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండీ..

చికెన్‌ సలాడ్‌ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండీ..అని చెబుతున్నారు న్యూట్రిషియన్స్. చికెన్ సలాడ్ తో అధిక బరువు తగ్గటంతోపాటు శరీరానికి మంచి పోషకాలు కూడా అందుతాయని సూచిస్తున్నారు.

Chicken Salad Benefits : చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. కూర, ఫ్రై, బిర్యానీ, కట్ లెట్, ఫ్రైడ్ రైస్, సూప్, సలాడ్ ఇలా ఎన్నో రకాలు చికెన్ వెరైటీలను లొట్టలేసుకుంటు లాగించేస్తారు నాన్ వెజ్ ప్రియులు. ముఖ్యంగా ఈకరోనా సీజన్ లో చికెన్ కు ఎంత డిమాండ్ వచ్చిందో చెప్పనక్కరలేదు. నాన్ వెజ్ తిననివారు కూడా అలవాటు చేసుకుని మరీ తింటున్నారు ఇమ్యూనిటీ కోసం. చికెన్ తింటే శరీరానికి పోషకాలు అందటమే కాదు..అధిక బరువును కూడా తగ్గించొచ్చు అంటున్నారు న్యూట్రిషియన్లు.

Read more : Peanuts : గుండెను రక్షించే వేరుశెనగలు

తరచూ చికెన్ సలాడ్ తింటే అద్భుతమైన ప్రయోజనాలున్నాయంటున్నారు న్యూట్రిషియన్లు. ఫైబర్‌ అధికంగా కలిగిన సలాడ్స్‌ తీసుకుంటే జీవక్రియల వేగం పెరగడంతో ఇవి అధిక బరువును నియంత్రిస్తాయి. పోషకాలు నిండిన చికెన్‌ను రోజూ తీసుకోవాలని..ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు రోజూ చికెన్‌ సలాడ్‌ తింటే మెరుగైన ఫలితాలుంటాయని చెబుతున్నారు న్యూట్రిషియన్లు.

Read more : Heart Issues Under 50: ఫిట్ ఈజ్ నాట్ హెల్తీ.. 50ఏళ్లలోపే గుండెపోటుతో అకాల మరణాలు!
శరీర నిర్మాణానికి కీలకమైన ప్రొటీన్‌ అధికంగా ఉండే చికెన్‌ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవలం చికెన్ ఒక్కటే కాకుండా దాంతో పాటు పండ్లు, కూరగాయలను కలిపి సలాడ్‌లా తీసుకుంటే శరీరానికి చక్కటి పోషకాలు అందుతాయని అలాగే యాక్సివ్ గా కూడా ఉండొచ్చు అంటున్నారు. తక్కువ క్యాలరీలు కలిగిన లీన్‌ మీట్‌ చికెన్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటాయి. దీంతో రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే..కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను సమర్ధంగా బ్యాలెన్స్ చేయొచ్చు.

Read more : Queen Elizabeth : సెంచరీ చేరువలో క్వీన్ ఎలిజిబెత్..ఆమె ఆరోగ్యం, ఆయుష్షు సీక్రెట్స్

శరీరానికి అవసరమైన హెల్ధీ ఫ్యాట్స్‌ చికెన్ ల మెండుగా ఉంటుంది. అదేసమయంలో చికెన్‌తో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంతో పాటు చికెన్ లో ఉన్న ప్రొటీన్లతో శరీరానికి చక్కటి శక్తి అందుతుంది. ఎముకలు, కండరాలు బలోపేతానికి చికెన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. చికెన్‌ సలాడ్‌లో వాడే ఆకుకూరలు, చికెన్‌, స్ర్పౌట్స్‌, టొమాటోలతో పుష్కలంగా ఐరన్‌, క్యాల్షియం, ప్రొటీన్‌, విటమిన్‌ కే, ఇతర సూక్ష్మ పోషకాలు తగినంతగా లభిస్తాయి. దీంతో అధికబరువు తగ్గటంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా సమకూరుతుంది. సో చికెన్ సలాడ్ తినండీ..అధిక బరువుకు చెక్ పెట్టండి అంటున్నారు న్యూట్రిషియన్స్.

ట్రెండింగ్ వార్తలు