Queen Elizabeth : సెంచరీ చేరువలో క్వీన్ ఎలిజిబెత్..ఆమె ఆరోగ్యం, ఆయుష్షు సీక్రెట్స్

అందం, ఆరోగ్యం, రాజసం, ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కలిసిన అద్భుతమైన మహిళ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్.25 ఏళ్లకే పాలనా పగ్గాలు చేపట్టిన థీర ఆరోగ్యం, సుదీర్ఘ ఆయుష్షు వెనుక సీక్రెట్ ఏంటీ

Queen Elizabeth Lifestyle : అందం, ఆరోగ్యం, రాజసం, ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కలిసిన అద్భుతమైన మహిళ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్. 25 ఏళ్లకే పాలనా పగ్గాలు చేపట్టి అప్రతిహంగా పాలన చేస్తున్న థీర. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయటంలో ఆమెకు ఆమే సాటి. ఆమెకు ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా ఉంటారు క్వీన్ ఎలిజిబెత్. 95 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా..100 ఏళ్లకు చేరువలో ఉన్న క్వీన్ ఎలిజిబెత్ అంత ఆరోగ్యంగా అంతా ఉల్లాసంగా ఎలా ఉండగలుతున్నారు? 95 ఏళ్ల వయస్సులో కూడా పాలనా బాద్యతను ఎలా నిర్వహిస్తున్నారు? సెల‌యేరులా ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో పాలనా అజమాయిషీ ఎలా చేస్తున్నారు?

పాలెస్ లో చీమ చిటుక్కుమని అనాలన్నా క్వీన్ ఎలిజిబెత్ పర్మిషన్ కావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది ఆమె హయాం. ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ద గ్రేట్ లేడీ బ్రిటన్ రాణీ క్వీన్ ఎలిజిబెత్ ఆరోగ్యం రహస్యమేంటీ?అనే సందేహాలపై ఓ పరిశోధనే జరిగింది అంటే ఆరోగ్యం పట్ల ఆమె తీసుకునే జాగ్రత్తలే కారణం. దటీజ్ క్వీన్ ఎలిజిబెత్..మరి ఆమె ఆరోగ్యానికి..ఫిట్ నెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్స్ గురించి పరిశోధనాకారుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం..

Read more : Einstein Stephen Hawking : ఐక్యూలో ఐన్‌స్టీన్‌, హాకింగ్‌లను మించిపోయిన చిన్నారి

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ కు ఇప్పుడు 95 ఏళ్లు. 100ఏళ్లకు చేరువలోఉన్నా ఆమెలో ఏమాత్రం చురుకుదనం తగ్గలేదు. సెల‌యేరులా ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో అంద‌రిలో స్ఫూర్తి నింపేలా ఉంటారామె. అలా ఆమె ఆరోగ్యానికి..ఫిట్ నెస్ కు, ఉత్సాహానికి కారణం ఆమె తీసుకునే ఆహారం, వ్యాయామం కారణమంటారు. అలా ఎన్నో ప్రత్యేకలు కలిగిన 95 ఏళ్ల బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్ అత్య‌ధిక వ‌య‌సు క‌లిగిన జీవించి ఉన్న మ‌హారాణిగా గుర్తింపు పొందారు.

Read more : Honeymoon Bed : హనీమూన్ బెడ్..ఒక దిండు ఒక దేశంలో మరో దిండు ఇంకో దేశంలో..

క్వీన్ ఎలిజిబెత్ పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ. 1926, ఏప్రిల్ 21న జ‌న్మించారు. తండ్రి మ‌ర‌ణంతో 25ఏళ్లకే పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టారు. క్వీన్ ఎలిజ‌బెత్ ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఎదుగుతూ దీర్ఘ‌కాలం జీవిస్తున్నార‌ని బ్రిటిష్ సంస్కృతిపై ప‌రిశోధ‌న చేసిన కొలోవ్‌స్కీ లాంగ్ లివ్ ది క్వీన్ అనే పుస్త‌కంలో రాసుకొచ్చారు. ఆమె ఏం తింటారు..వ‌ర్క్ షెడ్యూల్‌..విశ్రాంతి వేళ‌ల్లో ఏం చేస్తుంటారనే విష‌యాల‌ను ఆ పుస్తకంలో ప్ర‌స్తావించారు. ఇక ఆమె దీర్ఘాయువు వెనుక ఉన్న ఐదు రహ‌స్యాలు ఏంటో చూద్దాం..

ఫిట్‌నెస్ మెయింటైన్..
ఎంత కాలం జీవించామనే కాదు ముఖ్యం..ఆరోగ్యంగా ఆనందంగా ఎంత కాలం జీవించామనేదే ముఖ్యం. అలా ఆరోగ్యంగా జీవించాలంటే అద్భుత‌మైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలని నిపుణుడు చెబుతుంటారు. కానీ దాన్ని పూర్తి భిన్న క్వీన్ ఎలిజిబెత్. ఈ వయస్సులో కూడా ఫాస్టుగా నడిచే ఆమె సీక్రెట్ వెను ఆమె నడకే ఒక కారణంగా కనిపిస్తోంది. అత్యంత వేగంగా న‌డ‌వ‌డం వంటి సెన్సిబుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను న‌మ్ముతారామె. అలా ప్రతీ రోజు వాకింగ్ ఆమె దినచర్యలో భాగం.

తినే ఆహారం..పద్ధతి ప్రకారం తాగే మద్యం..
మద్యం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. కానీ పరిమితంగా తీసుకుంటే మద్యం ఔషధం. అపరిమితంగా తీసుకుంటే విషం. కానీ క్వీన్ ఎలిజిబెత్ మంచి ఆహారంతో పాటు మద్యాన్ని కూడా తీసుకుంటారు రాణి. మ‌ధ్యాహ్నం శాండ్‌విచ్‌తో పాటు డార్జ‌లింగ్ టీ తీసుకుంటారు. అప్పుడ‌ప్పుడూ కేక్స్ తినేందుకూ ఇష్ట‌ప‌డతారు. ఇక మ‌ద్యం. రాజ కుటుంబీకుల‌కు మ‌ద్య‌పానం అల‌వాటు ఉంటుంద‌ే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఉద‌యం జిన్ కాక్‌టైల్‌ను ఎంజాయ్ చేసే క్వీన్ లంచ్‌తో పాటు షాంపేన్ లేదా ఓ గ్లాస్ వైన్‌ను టేస్ట్ చేస్తారు.రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యానికే టీనేజ‌ర్‌గా ఉన్న క్వీన్ అప్ప‌టి త‌న త‌రం వారంద‌రిలాగే సింపుల్ మీల్స్ తీసుకోవటం ఆమె అలవాటు. ఆరోగ్యంగా ఉండటానికి అదొక మార్గం అని నమ్ముతారామె.

అలాగే సాయంత్రం మ‌రో గ్లాస్ వైన్. రాత్రికి డిన్న‌ర్‌తో పాటు ఎప్పుడైనా డ్రింక్. అదికూడా తీసుకోవాలని అనిపిస్తేనే. జ‌ర్మ‌న్ స్వీట్ వైన్ అంటే ఆమెకు ఇష్టమని రాజ‌భ‌వ‌నం మాజీ షెఫ్ డారెన్ మెక్ గ్రాడీ తెలిపారు. అదికూడా గతంలో.మితాహారంతో పాటు ఆమె రోజుకు నాలుగు గ్లాసుల‌కు మించి మ‌ద్యం తాగరని బ్రిటిష్ సంస్కృతిపై ప‌రిశోధ‌న చేసిన కొలోవ్‌స్కీ త‌న పుస్త‌కంలో రాసుకొచ్చారు. క్వీన్ భోజ‌న‌ప్రియురాలు కాక‌పోవ‌డం ఆమె దీర్ఘాయువు ర‌హ‌స్యం కావ‌చ్చ‌ు అని నిపుణులు భావిస్తుంటారు.

రోజ్ మిల్క్ మాయిశ్చ‌రైజ‌ర్‌..
తెల్లగా బొమ్మలా మెరిసిపోయే క్వీన్ ఎలిజ‌బెత్ అందం వెనుక నాచ్యురాలిటీ ఉంది. చాలా అరుదుగా మాత్రమే ఆమె మేక‌ప్ వేసుకుంటారు. క్వీన్ ఖ‌రీదైన కాస్మెటిక్ బ్రాండ్స్‌నే వాడాల‌ని అనుకోరట. రోజ్ మిల్క్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడుతుంటారట. ఆమె గులాబీ రంగులో మెరిసిపోవటానికి కారణం అదేనేమో.

చురుకైన మెద‌డు..క్వీన్ స్పెషాలిటీ..
95 ఏళ్ల వయస్సులో కూడా ఆమె మానసికంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అందుకేనేమో ఆమె మెదడు అత్యంత చురుకుగా ఉంటుందంటారు కొలోవ్ స్కీ. కీలకమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటంలో ఆమె చాలా ఫాస్టు గా ఉంటారట. క్వీన్ చ‌లాకీగా, ఆరోగ్యంగా ఉండ‌టానికి ఆమె మాన‌సిక ఆరోగ్యం కుదురుగా ఉండ‌ట‌మేన‌ంటారు కొలోవ్‌స్కీ.

పాలన వ్యవహారాలతో పాటు అన్ని విషయాలు తెలుసుకుంటారు. ప్రతీరోజు న్యూస్ పేపర్లు చదవటం నుంచి అన్ని విషయాలు తెలుసుకుంటారు. సామాజిక రాజ‌కీయ ప‌రిణామాల‌ను క్షుణ్ణంగా తెలుసుకోవ‌డంతో పాటు మెద‌డును చురుకుగా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. దీంతో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా పర్ ఫెక్ట్ గా ఉండటం ఆమె ప్రత్యేకత అంటారు కొలోవ్ స్కీ.

భావోద్వేగాల నియంత్ర‌ణ‌, స‌మ‌న్వ‌యం..
మాన‌సిక ఆరోగ్యం చాలా మఖ్యమంటారు క్వీన్. ఔన్న‌త్యంతో కూడిన సంస్కృతి నేప‌ధ్యంతో ఎదిగిన క్వీన్ ఎలిజ‌బెత్ భావోద్వేగాల నియంత్ర‌ణ‌, స‌మ‌న్వ‌యం సాధించ‌డంలో ఆమే స్టైలే వేరు అంటారు కొలోవ్‌స్కీ అంటారు. మాన‌సికంగా ధృడంగా ఉండే రాణి సైకాల‌జిస్టులు బెనిఫిట్ ఫైండిగ్‌గా పిలిచే ప్ర‌క్రియ‌ను ప్రాక్టీస్ చేస్తార‌ని చెబుతారు. 2002లో 101 ఏండ్ల వ‌య‌సులో మ‌ర‌ణించిన త‌న త‌ల్లి కంటే క్వీన్ ఎలిజ‌బెత్ ఎక్కువ కాలం బ‌తుకుతార‌న్న‌ది పరిశోధకుడు కొలోవ్‌స్కీ అంచ‌నా వేశారు. ఒత్తిడిని చిత్తు చేస్తూ త‌నంత‌ట‌ తాను ఎద‌గ‌డం ఎలాగో ఆమెను చూసి నేర్చుకోవాలంటారు. అంతేమరి ఒత్తిడిని చిత్తు చేస్తే మనిషి ప్రపంచాన్ని జయించినట్లేనని మానసిక నిపుణులు తరచు చెబుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు