Life Sentence For Gang Rape : సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

అనంతపురం జిల్లాలో ఏడేళ్ల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముద్దాయిలకు  న్యాయమూర్తి ఈరోజు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

Life Sentence For Gang Rape :  అనంతపురం జిల్లాలో ఏడేళ్ల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముద్దాయిలకు  న్యాయమూర్తి ఈరోజు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. పెద్దవడుగూరు మండలం కదర గుట్ట‌పల్లికి చెందిన ఓ మహిళపై   2014 మే నెలలో   కిష్టపాడు గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్,  తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడటమే కాక ఆ ఘోరాన్ని విజువల్స్  కూడా చిత్రీకరించారు.

Also Read : Extra Marital Affair : వివాహేతర బంధం… అతనికి 20, ఆమెకు 25, నెలలోపే ఇద్దరూ….!

ఆ వీడియోలను కిష్టపాడుకు చెందిన నల్లబోతుల శివ కృష్ణమూర్తి, బోయ రామాంజినేయులుకు పంపి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈమేరకు…పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌లో 02.06.2014 న కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 376 (D), 66 (A), 67 IT Act 2000-2008 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

అనంతపురం జిల్లా 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు విచారణ కొనసాగింది. న్యాయమూర్తి బి. సునీత ఈరోజు ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు,  మరియు చెరో రూ. 25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏడుగురి నిందితుల్లో A-6, A- 7 లుగా ఉన్న నల్లబోతుల శివ కృష్ణమూర్తి, బోయ రామాంజినేయులులు అనారోగ్య కారణాలతో కేసు విచారణ సమయంలో చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు