Road Accident
Road Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 15మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా డెకరేషన్ చేసే పనివాళ్లు. వాహనంలో వారందరికీ గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కాకాని పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read : హర్భజన్ సింగ్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్.. అసలు గొడవ ఏమిటంటే?
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను తేజ (20), రాంబాబు (40), మధు (25)గా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి నిద్రమత్తు కారణమా? మరేమైనా కారణమా? మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.