ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..

గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడి తల్లిదండ్రులు అనుమానించినట్టుగానే జరిగింది.

Adilabad School Teacher: ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. నాగల్ కొండ గ్రామానికి చెందిన టీచర్ జాదవ్ గజేందర్(40) మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. జైనథ్ మండలంలోని మేడిగూడ(కే)లో ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో పనిచేస్తున్న ఆయనను బుధవారం ఉదయం గాదిగూడ మండలం అర్టుని కొలాంగూడ శివారులో హత్య చేశారు. మృతుడి తండ్రి జాదవ్ బిక్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ పర్యవేక్షణలో సీఐ రహీంపాషా ఆధ్వర్యంలోని స్పెషల్ టీమ్ దర్యాప్తు చేపట్టడంతో కేసు కొలిక్కివచ్చింది.

రూ.20 లక్షల సుపారీ ఇచ్చి..
గజేందర్ తల్లిదండ్రులు అనుమానమే నిజమైంది. తమ కొడుకును కోడలే హత్య చేయిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో గజేందర్ భార్య విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కుట్ర బయటపడింది. భర్తను తానే హత్య చేయించినట్టు ఆమె ఒప్పుకుంది. రూ.6 లక్షలు సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించినట్టు పోలీసుల విచారణలో నిందితురాలు అంగీకరించింది.

కుట్ర బయటపడిందిలా..
ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన విజయలక్ష్మి అతడిని అంతమొందిచాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం బేల ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులు బండే సుశీల్, ఉర్వేత కృష్ణకు రూ.6 లక్షల సుపారీ ఇచ్చింది. ఆమెకు ప్రియుడు రాథోడ్ మహేశ్ సహకరించాడు. స్కూల్ రిఓపెన్ రోజు విధులకు వెళ్తున్న గజేందర్ ను దుండగులు అడ్డగించి.. ఖాళీ ప్రదేశంలోకి లాక్కెళ్లి రాళ్లు, మారణ ఆయుధాలతో అతి కిరాతకంగా హతమార్చారు.

Also Read: స్టార్ హీరో దర్శన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు.. అసలెవరీ ప్రవిత్రా గౌడ?

కోడలిపై తమకు అనుమానం ఉందని గజేందర్ తండ్రి ఫిర్యాదులో పేర్కొనడంతో విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్‌ను పరిశీలించడంతో కుట్ర బయటపడింది. విజయలక్ష్మి, ప్రియుడు మహేశ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా కేసును పోలీసులు చేధించారు. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గజానంద్‌ తలిదండ్రులతో పాటు బంధువులు పలు గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు నార్నూల్ మండల కేంద్రంలో శుక్రవారం ధర్నా చేశారు.

ట్రెండింగ్ వార్తలు