కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఆరుగురు మరణించారు.

Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. కృతివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో లారీ డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు.

Also Read : Modi Tadasana : ప్రధాని మోదీ ‘తాడాసనం’ వీడియో చూశారా.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా?

ప్రమాదం సమయంలో ఒక లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తుండగా.. మరో లారీ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఐదుగురిది పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్ తో పాటు 10మంది ప్రయాణికులు ఉన్నారని, భీమవరం వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్ తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా.. ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు