Guntur Incident: బాబోయ్.. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసిన భార్య
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ ను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు.
Watching Tv Representative Image (Image Credit To Original Source)
- ప్రాణం తీసిన టీవీ సౌండ్
- టీవీ సౌండ్ విషయంలో దంపతుల మధ్య గొడవ
- టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్త హత్య
Guntur Incident: భార్య, భర్తల మధ్య బంధం బలహీనపడుతోంది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని చేసుకున్న వాగ్దానం చెదిరిపోతోంది. చిన్న చిన్న విషయాలకే చంపుకునే వరకు వెళ్తున్నారు. దంపతుల మధ్య ఓపిక, సహనం లేకుండా పోయే పరిస్థితులు ఏరడ్డాయి. క్షణాకావేశంలో భార్యను భర్త, భర్తను భార్య హతమార్చుకుంటున్నారు. అనుమానంతో కొందరు, మద్యం మత్తులో మరికొందరు, పరాయి వ్యక్తి మోజులో ఇంకొందరు బరి తెగిస్తున్నారు. కట్టుకున్న మొగుడు, భార్య అని కూడా చూడటం లేదు ప్రాణాలు తీసేస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఓ దారుణం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. ఓ చిన్న విషయంలో తలెత్తిన వివాదం మర్డర్ కు దారితీసింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసింది భార్య. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
మృతుడిని షేక్ అహ్మద్ (27) గా గుర్తించారు. అహ్మద్ ఏసీ మెకానిక్ గా పని చేస్తున్నాడు. అహ్మద్, అతడి భార్య క్రాంతి టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే, గురువారం రాత్రి టీవీ సౌండ్ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. టీవీ శబ్దం ఎక్కువగా ఉండటంతో సౌండ్ తగ్గించాలని భార్యను కోరాడు అహ్మద్. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది కాస్తా గొడవకు దారితీసింది. భార్య క్రాంతా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. నా మాటే కాదంటావా అంటూ ఇంట్లో ఉన్న కత్తితో భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ ను చుట్టుపక్కల వారు విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. చిన్న విషయానికే తాళి కట్టిన భర్తను.. భార్య చంపిన వైనం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. కాగా, అహ్మద్ కాంత్రి ఏడాది క్రితమే వివాహం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
