Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. రెక్కీ నిర్వహించి.. రెండు కత్తులు కొనుక్కొని.. మహిళను నరికి చంపిన మాజీ భర్త.. తరువాత బాత్రూంలోకి వెళ్లి..
Hyderabad : హైదరాబాద్ నగరం వనస్థలిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ఆమె మాజీ భర్త దాడిచేసి హత్య చేశాడు.
Hyderabad
- హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం
- మహిళను నరికి చంపిన మాజీ భర్త
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hyderabad : హైదరాబాద్ నగరం వనస్థలిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై కేసు పెట్టి కెనడాకు వెళ్లనీయకుండా అడ్డుకుని.. తన కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ఓ సాప్ట్వేర్ ఉద్యోగినిపై మాజీ భర్త దాడిచేసి నరికి చంపేశాడు. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీ అపార్టుమెంట్ లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : RTC Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఏపీకి వెళ్తుండగా ఘటన..
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేశ్ (32), మహారాష్ట్రకు చెందిన బుతర్తి సునీత (30) సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరిద్దరికీ 2022లో పెండ్లి జరిగింది. కొద్దికాలం తరువాత వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అదే సమయంలో మహేశ్ కెనడా వెళ్లాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తరువాత కూడా వారిద్దరి మధ్య గొడవలు జరగడంతో.. సునీత మహారాష్ట్రలోని బల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో గృహహింస కింద కేసు పెట్టింది. ఈ ఘటన తరువాత 2024లో పెద్దల సమక్షంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2025లో సునీత వనస్థలిపురానికి చెందిన శ్రీనాథ్ అనే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుంది.
సునీత మరో వ్యక్తి ప్రేమవివాహం చేసుకున్న తరువాత కూడా మహేశ్ పై పెట్టిన కేసులను వాపస్ తీసుకోలేదు. దీంతో మహేశ్ కెనడా వెళ్లేందుకు వీలులేకుండా పోవడంతోపాటు.. అతని పాస్ పోర్ట్ కూడా సీజ్ అయింది. అదే సమయంలో మహేశ్ తల్లి గుండెపోటుతో మృతి చెందింది. దీంతో మహేశ్ సునీతపై తీవ్ర కోపాన్ని పెంచుకున్నాడు. తనపై కేసులు పెట్టి కెనడా వెళ్లకుండా చేయడంతోపాటు.. తమను ఇబ్బంది పెట్టి తన తల్లికి గుండెపోటుతో మరణించడానికి కారణం సునీతనేనని మహేశ్ కోపం పెంచుకున్నాడు.
మరోవైపు.. రెండోపెళ్లి చేసుకున్న సునీత తన రెండో భర్తతో హ్యాపీగా ఉంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ పోతుంది. తనను ఇబ్బంది పెడుతున్న సునీత తన భర్తతో సంతోషంగా ఉండటాన్ని మహేశ్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. సునీత అడ్రస్ తెలుసుకొని ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. హత్య చేసేందుకు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితోపాటు.. రెండు చిన్న కత్తులు కొన్నాడు. డోర్‌ను కట్ చేసేందుకు ట్రీ కట్టింగ్ మిషన్ కూడా కొనుగోలు చేశాడు. సునీత ఒంటిరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను హత్య చేసేందుకు మహేశ్ ప్లాన్ చేసుకున్నాడు.
సునీత భర్త శ్రీనాథ్ బుధవారం బయటకు వెళ్లడాన్ని చూసిన మహేశ్.. మధ్యాహ్నం సమయంలో సునీత నివాసం ఉండే అపార్టుమెంట్లోకి వెళ్లాడు. నేరుగా సునీత ప్లాట్‌లోకి వెళ్లి గడియపెట్టాడు. మహేశ్ రావడాన్ని గమనించిన సునీత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్పటికి ఆమె మూడు నెలల గర్భవతి. పారిపోయేందుకు ప్రయత్నించిన సునీతను పట్టుకున్న మహేశ్.. కొబ్బరిబోండాల కత్తితో తల వెనుకాల నరికాడు. సునీత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అతంటితో ఆగకుండా తనతో తెచ్చుకున్న కత్తులతో ఆమె శరీరంపై పలుసార్లు పొడిచాడు.
ప్లాట్‌లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు గుమ్మిగూడగా మహేశ్ పారిపోయేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్లాటులోని బాత్రూంలో దాక్కున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మహేశ్ ను అరెస్టు చేశారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
