Flipkart Freedom Sale : వారెవ్వా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 17వేలు తగ్గింపు..!
Flipkart Freedom Sale : వచ్చే వారమే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. ఈ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది.. పిక్సెల్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలో చూద్దాం..
Google Pixel 10 Sale
- భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 ఆగస్టు 8న ప్రారంభం
- గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 62,999 ప్రారంభ ధర మాత్రమే
- ఈ సేల్‌లో పిక్సెల్ 10ఎ ఫోన్ రూ. 50,999కే కొనేసుకోవచ్చు
Flipkart Freedom Sale : పిక్సెల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో ఈ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఇతర యూజర్ల డివైజ్‌లు, హోం అప్లియన్సెస్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఆసక్తిగల కస్టమర్లు నేరుగా డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్ల ద్వారా భారీగా తగ్గింపు పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో (Flipkart Freedom Sale) కొనుగోలు చేసే కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్కు ముందే కంపెనీ మరెన్నో డీల్స్‌ను రివీల్ చేసింది.
ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10 భారీ తగ్గింపుతో పొందవచ్చు. మీరు కూడా ఈ పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు. పిక్సెల్ 10పై బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
Read Also : Apple iPhone 17 Pro Max : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే?
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 10 ధర తగ్గింపు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ అసలు ధర రూ. 79,999 నుంచి తగ్గింది. ఈ సేల్ సందర్భంగా రూ. 62,999 ధరకే లభిస్తోంది. నెలవారీగా రూ. 6,999 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు.
పిక్సెల్ 10ఎ ధర తగ్గింపు :
గూగుల్ పిక్సెల్ 10a అసలు ధర రూ. 56,999 నుంచి తగ్గింది. ఈ సేల్‌లో రూ. 50,999కే లభిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను ఈఎంఐలో కొనాలనుకుంటే నెలవారీగా రూ. 8,499కే ఇంటికి తెచ్చుకోవచ్చు.
పిక్సెల్ 10 ప్రో ధర తగ్గింపు :
ఈ సేల్ సమయంలో పిక్సెల్ 10 ప్రో అసలు ధర రూ. 109,999 ఉండగా రూ. 99,999కే లభిస్తుంది. నెలకు రూ. 11,111 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ రూ. 114,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 124,999 ఉండగా రూ. 10వేలు తక్కువకే లభిస్తోంది.
