love Affair : క్లాస్‌మేట్‌తో భార్య లవ్ ఎఫైర్-భర్తకు తెలియటంతో ..

కాలేజీలో చదువుకునే రోజుల్లో నడిపిన ప్రేమ వ్యవహారం పెళ్లి అయ్యాక కూడా కొనసాగించిన యువతి చిక్కులలో పడి చివరికి ప్రియుడితో కలిసి తనువు చాలించిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

love Affair :  కాలేజీలో చదువుకునే రోజుల్లో నడిపిన ప్రేమ వ్యవహారం పెళ్లి అయ్యాక కూడా కొనసాగించిన యువతి చిక్కులలో పడి చివరికి ప్రియుడితో కలిసి తనువు చాలించిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి   వెళితే   విశాఖజిల్లా కశింకోట మండలం మోసయ్య పేట శివారు గోకివానిపాలెంలో బుచ్చియ్య పేటకు చెందిన మజ్జి శ్రీనివాసరావు(25), కే. కోటపాడు మండలం చౌడువాడకు చెందిన చెల్లపల్లి హేమలత(23) లు 2017 లో చోడవరం కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.

కాలేజీ చదవు పూర్తయిన తర్వాత హేమలతకు భాస్కరరావు అనే వ్యక్తితో వివాహం అయి కాపురానికి వచ్చింది. శ్రీనివాసరావు చోడవరంలో ఒక షోరూంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. పెళ్లై కాపురానికి వచ్చినా ఆమె శ్రీనివాసరావుతో రహస్యంగా ఫోన్ లో మాట్లాడుతూ ప్రేమ వ్యవహారం కొనసాగించటం భాస్కరరావుకు, ఆమె తండ్రికి తెలిసింది.
Also Reading : April 1st : అమ్మో ఏప్రిల్ 1వ తారీఖు
ఈక్రమంలో ఇటీవల వారిద్దరూ ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈనేపధ్యంలో బుధవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన హేమలత, ప్రియుడు శ్రీనివాసరావును కలిసింది. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి బైక్ పై  గోకివానిపాలెం గ్రామం వద్దకు చేరుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన స్ధానిక రైతులు మృతదేహాలను చూసి పోలీసులకు సమచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు