Hardik Pandya : దేన్ని సులువుగా వ‌దిలిపెట్ట‌ను.. గ‌త కొన్ని నెల‌లుగా క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నా : హార్దిక్ పాండ్య‌

గ‌త కొన్నాళ్లు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

Hardik Pandya

Hardik Pandya – T20 World Cup 2024 : గ‌త కొన్నాళ్లుగా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకున్న నాటి నుంచి అత‌డు వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఘోరంగా ఓడి ఆఖ‌రి స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా విఫ‌లం అయ్యాడు. అదే స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త జీవితంలో విడాకులు తీసుకుంటున్న‌ట్లు రూమ‌ర్లు వ‌చ్చాయి. దీంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అత‌డిని ఎందుకు ఎంపిక చేశారు అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఐపీఎల్ ముగిసిన వెంట‌నే లండ‌న్‌కు వెళ్లిన పాండ్య అక్క‌డ కాస్త రిలాక్స్ అయ్యాడు. తిరిగి జ‌ట్టుతో చేరాడు. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌లో 40 ప‌రుగులు చేయ‌డంతో పాటు ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. మ్యాచ్ అనంత‌రం అత‌డు మాట్లాడుతూ గ‌త కొన్ని నెల‌లుగా క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పాడు. ఎలాంటి స‌మ‌స్య‌నైనా సులువుగా వ‌దిలిపెట్ట‌న‌ని, చివ‌రి వ‌ర‌కు పోరాడుతాన‌ని చెప్పాడు.

Venkatesh Iyer : ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ను పెళ్లి చేసుకున్న టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌..

జీవితం అనే యుద్ధంలో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాల‌న్నాడు. కొన్ని సార్లు క్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఎదురవుతాయి. వాటిని వ‌దిలివ‌స్తే అనుకున్న ఫ‌లితాల‌ను సాధించ‌లేమ‌న్నాడు. ఇలాంటివి ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మ‌నే విష‌యం త‌న‌కు తెలుసున‌న్నాడు. అయితే.. వాటిన్నింటిని దాటుకుని ముందుకు సాగ‌డం పైనే త‌న దృష్టి నెల‌కొని ఉంద‌న్నాడు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు ఎలాంటి విధానం అనుస‌రించానో ఇప్పుడు అలాగే ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చాడు.

జీవితంలో అన్ని చెడ్డ రోజులు ఉండ‌వ‌న్నాడు. మంచిరోజులు కూడా ఉంటాయ‌న్నాడు. క్లిష్ట ద‌శ‌ల‌ను దాటుకుంటూ ముందుకు వెల్లాల‌న్నాడు. త‌న జీవితంలో ఇలాంటి ద‌శ‌ల‌ను ఎన్నో దాటుకుంటూ వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. విజ‌యం సాధించిన‌ప్పుడు ఎక్కువ‌గా పొంగిపోన‌ని, త‌రువాత ఏం చేయాల‌నే దానిపైనే దృష్టిపెడుతాన‌న్నాడు. ఇక క‌ష్ట‌స‌మ‌యాల్లోనే ఇలాగే ఆలోచిస్తాన‌ని వెల్ల‌డించాడు. స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటి నుంచి పారిపోన‌ని, చివ‌రి వ‌ర‌కూ పోరాడేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని పాండ్య అన్నాడు.

Aaron Jones : ఆరోన్ జోన్స్ సిక్స‌ర్ల వ‌ర్షం.. యువ‌రాజ్ సింగ్ రికార్డు క‌నుమ‌రుగు.. క్రిస్‌గేల్ రికార్డు ప‌దిలం

ట్రెండింగ్ వార్తలు