MLA Ketireddy Peddareddy : పరిగెత్తించి కొడ్తా..! జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

జేపీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నాకూ పంట బీమా వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు. కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

Tadipatri MLA Ketireddy Peddareddy

పెద్దారెడ్డి .. Anathapuram District : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పద్దారెడ్డి (MLA Ketireddy Peddareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కనక ఎమ్మెల్యే కాకపోతే తాడిపత్రి (Tadipatri) పురవీధుల్లో పరిగెత్తించి కొడ్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యే కావడం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పెట్టిన బిక్ష. నీకు దమ్ముంటే నా పొల్లల్లో కాళ్ళు పెట్టి చూడు.. కథ వేరే లా ఉంటది అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు పొలాలు ఉండకూడదా? ఇన్సూరెన్స్‌లు రాకూడదా అంటూ ప్రశ్నించారు. దొంగతనాలు చేసే కుటుంబం నీది. నాది నీతినిజాయితీ గల కుటుంబం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని తిట్టినప్పుడు నీ మీద ప్రజలు సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెట్టారో గుర్తు చేసుకో. సీఐ‌లు, ఎస్ఐలను నోటికొచ్చినట్టు తిడతావ్. నువ్వు చచ్చిపోతే తాడిపత్రికి పట్టిన దరిద్రం పోతుంది అంటూ జేపీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

JC Prabhakar Reddy : చీనా తోటకు వస్తున్నా…. దమ్ముంటే ఆపు : కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

ఈ సందర్భంగా జేపీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నాకూ పంట బీమా వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు. కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వ్యక్తిని ఈ రాష్ట్రంలో నేను ఎవరిని చూడలేదని కేతిరెడ్డి అన్నారు. పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి‌తోపాటు నా తోటలో అడుగు పెట్టి చూడు అంటూ సవాల్ విసిరారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. ఈ పదవి లేకపోతే జేసీని ఇంటిలో నుంచి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా ఊరేగిస్తా అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కొడితే సానుభూతి వస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాదిన్నర చీనా తోటకు పంట బీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమాలో రైతులకు న్యాయం జరగలేదని.. వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందని, క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశాడని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనా తోటకు వస్తున్నా…. దమ్ముంటే ఆపండి అని ఛాలెంజ్ చేశారు. చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు