Nara Lokesh : యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది : నారా లోకేష్

నెల్లూరుని వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ భూదందాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు.

Nara Lokesh (4)

Yuvagalam padayatra : నెల్లూరు జిల్లాలో యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసిందని టీడీపీ నాయకుడు నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు ఆలోచించాలని కోరారు. 2014లో మూడు సీట్లు ఇస్తే టీడీపీ చేసిన అభివృద్ధి.. 2019లో 10కి 10 సీట్లు ఇస్తే వైసీపీ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా మళ్లీ అభివృద్ధి చెందాలంటే 2019లో వైసీపీకి ఇచ్చిన 10 సీట్లు తమకు ఇవ్వాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పారు. మంగళవారం నెల్లూరు జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.

జగన్.. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని అవమానించారు కాబట్టి వారందరూ బయటకి వచ్చారని పేర్కొన్నారు. నారాయణను చూస్తే జగన్ కు భయం..అందుకే అనేక కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. అయినా భయపడకుండా నారాయణ పార్టీకి సేవలు అందించి కడిగిన ఆణిముత్యంలా బయటకి వచ్చారని పేర్కొన్నారు.

Gudivada Amarnath : మీకు పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది : హరిరామజోగయ్యకు మంత్రి గుడివాడ బహిరంగ లేఖ

జగన్ కి కష్టం వస్తే మొదట నిలబడిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని తెలిపారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీలో అవమానం జరిగింది కాబట్టి బయటకి వచ్చారని అనుకుంటున్నారని తెలిపారు. అవమానం జరిగింది రూరల్ నియోజకవర్గానికి కాబట్టి ఆయన వైసీపీ నుంచి బయటకి వచ్చారని వెల్లడించారు. నెల్లూరుని వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ భూదందాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు. నారాయణ అభివృద్ధిలో మాస్టర్ అని తెలిపారు. నారాయణ ఒక్క నెల్లూరు సిటీని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. కానీ, సిల్లీ బచ్చా సిటీలో చేసిన అభివృద్ధి నిల్.. కానీ అక్రమంగా పోగేసింది 1000 కోట్లు రూపాయలు అన్నారు. నెల్లూరు సిటీకి వచ్చా, వీఆర్సీ సెంటర్ కి వచ్చా.. నెల్లూరు అభివృద్ది పై చర్చ కు సిద్ధమా అని సవాల్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు