New Year Celebrations : వెల్‌కమ్ 2022.. బైబై 2021 : తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్

తీపి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

New Year Celebrations : పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరం వచ్చేసింది. 2021కి గుడ్‌ బై చెప్పేసి.. 2022కి గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పేసింది యావత్‌ దేశం. 2022లోకి అడుగు పెట్టిన వేళ.. దేశ వ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంబురాల్లో.. తగ్గేదేలే అన్నట్లు జోష్‌ కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకై పరిమితై వేడుకలు జరుపుకుంటున్నారు. హుషారైన పాటలతో సైనికులు హోరెత్తించారు. డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

తీపి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నిన్న సాయంత్రం నుంచే మొదలైన న్యూ ఇయర్‌ ఉత్సాహం అర్ధరాత్రి అయ్యే సరికి అంబరాన్ని తాకింది. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ కేరింతల కోలాహలంతో మార్మోగింది.

Happy New Year 2022 : దేశవ్యాప్తంగా న్యూఇయర్ జోష్… కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్

జ్ఞాపకాల తెరచాటుకు మరో ఏడాది తరలిపోయింది. విభిన్న అనుభవాలు, అనుభూతులను మిగిల్చి ఇక వెళ్లొస్తానంటూ సెలవు తీసుకోవడంతో కేరింతలు, ఉల్లాసంతో అంతా కొత్త అతిథికి స్వాగతం పలికారు. కొవిడ్‌ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయి న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారితో గతేడాది అంతంత మాత్రంగానే జరిగిన వేడుకలు.. కోవిడ్‌ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి పెద్ద ఎత్తున జరిగాయి. న్యూ ఇయర్‌ వేడుకల్లో చిన్నా, పెద్దా సంబురాల్లో మునిగితేలారు. యువత కేరింతలు, ఆటపాటలతో సందడి చేసింది. ఇళ్లలో కేక్‌లు కట్‌ చేసి సాదరంగా.. కొత్త సంవత్సరాన్ని ప్రజలు ఆహ్వానించారు.

హైదరాబాద్‌ ప్రజలకు సీపీ సీవీ.ఆనంద్‌ న్యూ ఇయర్ విషెస్‌ చెప్పారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద ఆయన న్యూ ఇయర్‌ కేక్‌ కట్ చేశారు. కొత్త సంవత్సరం మరింత ఆనందంగా ఉండాలని.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నగర వాసులకు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్ద.. కేక్‌ కట్‌ చేశారాయన. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

 

ట్రెండింగ్ వార్తలు