ఏపీలో పోలింగ్ హింసపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.

Botcha Satyanarayana : ఏపీలో పోలింగ్ హింస, అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల బదిలీ జరిగిన చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారులను మార్చేలా చేశారని, అందువల్లే అల్లర్లు చెలరేగాయని ఆయన ఆరోపించారు. గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.

”పిన్నెల్లి వీడియోను ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు రిలీజ్ చేయలేదు? అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలేం జరిగింది? అనేది ప్రజలకు తెలియాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే పోలీసు అధికారులను ఎస్పీ స్థాయి అధికారులను బదిలీలు చేశారో అక్కడే అల్లర్లు జరిగాయి. ఆ నాలుగు జిల్లాల్లో తప్ప మరెక్కడా అల్లర్లు జరగలేదు. మన రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయం లేదు. వైజాగ్ లోకి కూడా ఆ సాంప్రదాయం వచ్చింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ప్రజలు తమ నాయకుడిని నిర్ణయించేశారు అప్పుడే.

అన్ని పార్టీల నేతలు రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. మా నాయకుడు జగన్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్లారు. చంద్రబాబు మాత్ర ఎక్కడికి వెళ్లారో చెప్పకుండా వెళ్లారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. చంద్రబాబు కొడుకు మూడు రోజుల ముందే పారిపోయాడు. ఇంకో ఆయనకు ఎక్కడికి వెళ్లాలో ఆయనకే తెలీదు. వారంతా రిలాక్స్ మూడ్ లో ఉంటే.. ద్వితీయ, తృతీయ నాయకులు ఎందుకు కొట్లాడుతున్నారు. మీరంతా సంయమనం పాటించండి అని మా నాయకుడు చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Also Read : నారా లోకేశ్ పై .. టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు