Happy New Year 2022 : దేశవ్యాప్తంగా న్యూఇయర్ జోష్… కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్

దేశవ్యాప్తంగా న్యూఇయర్ జోష్ నెలకొంది. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. 2021కి గుడ్ బై చెప్పి 2022 కు వెల్ కమ్ చెప్పారు.

Happy New Year 2022 : దేశవ్యాప్తంగా న్యూఇయర్ జోష్ నెలకొంది. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. 2021కి గుడ్ బై చెప్పి 2022 కు వెల్ కమ్ చెప్పారు. చిన్న, పెద్ద అంతా గ్రాండ్ గా న్యూ ఇయర్ కి స్వాగతం చెప్పారు.

అంతా న్యూ ఇయర్ వేడుకలను జాలీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక యువత సంగతి చెప్పక్కర్లేదు. కుర్రకారు వేడుకలతో ఉర్రూతలూగుతోంది. బాణాసంచా పేలుస్తూ యువత సంబరాలు జరుపుకుంటోంది. కాగా, ఒమిక్రాన్ కారణంగా ఆంక్షల మధ్యే వేడుకలు జరుపుకుంటున్నారు.

ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామన్నారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.

ఏపీ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాది ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వివక్ష లేకుండా అన్నివర్గాల వారికి తమ ప్రభుత్వం సంక్షేమం అందిస్తోందని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు