AP CM YS Jagan: అమరావతిపై ఎలాంటి కోపం లేదు: ఏపీ సీఎం జగన్

అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.

AP CM YS Jagan: అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు.

Tamil Nadu Man: కువైట్‌లో దారుణం.. ఒంటెను చూసుకోలేదని తమిళనాడు వాసిని దారుణంగా చంపిన యజమాని

‘‘అమరావతి ప్రాంతంపై నాకు ఎలాంటి కోపం లేదు. ప్రతి ప్రాంతంలోనూ అందరూ ఎంతోషంగా ఉండాలి. ఈ ప్రాంతంలో రోడ్లు, నీరు, కరెంటు వంటి మౌలిక వసతులకే, రూ.1 లక్షా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చంద్రబాబు లెక్కలు ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం కనీసం ఐదు లక్షల కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు. కనీస సదుపాయాల కోసమే రూ.1 లక్షా పది వేల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పినప్పుడు ఆయన హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తే 420 కేసు పెట్టాలి. చంద్రబాబు హయాంలో సంవత్సరానికి వెయ్యికోట్లు కూడా ఖర్చు చేయలేదు.

Udupi Roads: పాడైన రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపై గుంతలకు హారతి, పొర్లు దండాలతో నిరసన

రాజధానిపై ప్రేమ ఉన్న చంద్రబాబు రూ.2200 కోట్లు బకాయిలు చెల్లించలేదు. రాజధానిలో చంద్రబాబు బినామీలందరికీ భూములు ఉన్నాయి. చంద్రబాబు రాజధాని కోసం ఇచ్చింది రూ.5500 కోట్లు మాత్రమే. చంద్రబాబు చెప్పిన రూ.1 లక్షా 5 వేల కోట్లు ఖర్చు పెట్టాలంటే మరో వంద‌ సంవత్సరాలు పడుతుంది. రాజధానిపై నాకు వ్యతిరేకత లేదు. ప్రభుత్వం వద్ద డబ్బుంలుంటే నాకు అభ్యంతరం లేదు. డబ్బు లేకనే మూడు ప్రాంతాల అభివృద్ధి అంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటుకు నోట్లు కేసులో దొరికిపోయాడు. టెంపరరీ రాజధాని అని చంద్రబాబు అమరావతిని ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇలాంటి ప్రాంతంలో ఉద్యమాలా? రకరకాల డ్రామాలు ఇక్కడ‌ జరుగుతున్నాయి.

Asteroid: భూమికి దగ్గరగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్.. ఎంత పెద్దదో తెలుసా

కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని చేస్తున్నారు. ఇతర ప్రాంతాల మనోభావాలు దెబ్బ తీస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. అమరావతి ఎందుకు గొప్పదో చెప్పాలి? ఎవరి అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తున్నారో చెప్పాలి? కేవలం పెత్తందారుల సొంత‌ అభివృద్ధి కోసమే ఉద్యమాలు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే ‌సమయానికి రాష్ట్ర బడ్జెట్ 2లక్షల 27 వేల కోట్లు. చంద్రబాబు హయాంలో జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతు భరోసా వంటివి ఎందుకు ఇవ్వలేదు? నవరత్నాల ద్వారా 1 లక్షా 65 వేల కోట్లు డీబీటీల ద్వారా నేరుగా‌ బటన్ నొక్కి అక్క చెల్లమ్మలకు ఇస్తున్నాం. కరోనా సమయంలోనూ ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు చేయలేదు? ఆ పధకాలు ఏవి? డబ్బులు ఎవరెవరి జేబుల్లోకి పోయాయో అలోచన చేయాలి.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

రాజధాని అంటే తమ బినామీ భూములు అనేదే వారి అభిప్రాయం. హెరిటేజ్ కోసం అన్ని డెయిరీలు మూసేశారు. ఎవరూ మార్కెట్లో ఉండకూడదనేది వారి అభిప్రాయం. నేను నా మనుషులు ఉండాలన్నదే ఆ పెత్తందారుల మనస్తత్వం. చైతన్య, నారాయణ‌ తప్ప ప్రభుత్వ స్కూళ్లు మూసి వేయాలనేది వారి మనస్తత్వం’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు