Panchkarla Ramesh Babu : వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రమేష్ బాబు రాజీనామా.. కారణం ఏమిటంటే..

విశాఖపట్టణం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు.

Panchkarla Ramesh Babu

Visakha District YCP Party : విశాఖ జిల్లా (Visakha District) లో వైఎస్ఆర్ సీపీ (YSRCP) కి షాక్ తగిలింది. ఆ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు (Panchkarla Ramesh Babu) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ మోహన్‌రెడ్డి  (CM Jagan Mohan Reddy) దృష్టి‌కి తీసుకువెళ్ళాలని ప్రయత్నించానని, కానీ వీలు కాలేదని చెప్పారు. ప్రజా సమస్యలు, క్రింది స్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండటం, పార్టీలో ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానని రమేష్ బాబు అన్నారు.

YCP MP Midhun Reddy: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న వైసీపీ ఎంపీ

అధ్యక్షుడు అంటే స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదు. సామాజిక వర్గ మీటింగ్‌లు పెట్టొద్దని పార్టీ ఆదేశించింది. ఏ నియోజక వర్గంలోకి వెళ్లిన అక్కడి ఎమ్మెల్యే‌కు అనుకూలంగా సుబ్బారెడ్డి మాట్లాడతారు. నాకు సుబ్బారెడ్డికి ఏ విభేదం లేదని రమేష్ బాబు చెప్పారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ఆ పార్టీకి రమేష్ బాబు రాజీనామా చేయడంవెనుక పెందుర్తి పంచాయితీనే కారణంగా తెలుస్తోంది. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల రమేష్ బాబు మధ్య సీటు వార్ కొద్దికాలంగా నడుస్తోంది. ఇటీవల పెందుర్తిలో జరిగిన పరిణామాలతో రమేష్ బాబు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.

YCP MP Midhun Reddy: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న వైసీపీ ఎంపీ

పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి ఎలమంచిలి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. 2019లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం పంచకర్ల రమేష్ బాబుకు విశాఖపట్టణం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

ట్రెండింగ్ వార్తలు