Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు

సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు.

Fight in Petrol Bunk: పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బంది ఓ యువకుడిపై చూపిన అత్యుత్సాహం చివరకు..బంకు యజమాని ప్రాణాల మీదకు తెచ్చింది. పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చిన యువకుడిపై బంకులోని సిబ్బంది గొడవపెట్టుకోగా..అడ్డుకోబోయిన యజమానిపై ఆ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. పెట్రోల్ కొట్టే విషయమై యువకుడు, బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

Also read:Proddatur Crime: ఎస్సి మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారం: కేసు కూడా నమోదు చేయని ప్రొద్దుటూరు పోలీసులు?

సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు. దీంతో కక్ష కట్టిన యువకుడు ఇంటికి వెళ్లి కత్తితో తిరిగి వచ్చి పెట్రోల్ బంక్ యజమానిపై దాడికి పాల్పడ్డాడు. దాడి నుంచి తృటిలో తప్పించుకున్న యజమాని గుర్రం బాబ్జి..స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దాడికి పాల్పడ్డ యువకుడు అల్లవరం మండలం తమ్మలపల్లికి చెందినవాడిగా గుర్తించి, యువకుడిపై అల్లవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బంకు యజమాని బాబ్జి.

Also read:AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..

ట్రెండింగ్ వార్తలు