Red Sanders: చంద్రగిరి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం పట్టివేత

ఎర్రచందన అక్రమ రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా..అక్రమార్కుల్లో మార్పురావడం లేదు.

Red Sanders: చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంత పరిధిలో ఎర్ర చందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఎర్రచందన అక్రమ రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా..అక్రమార్కుల్లో మార్పురావడం లేదు. అటవీశాఖ అధికారులు, పోలీసుల కళ్లుగప్పి టమోటా లోడు మాటున ఎర్రచందనాన్ని తరలిస్తున్న మినీ వ్యాన్ ను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మూలపల్లి అటవీప్రాంతం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Also read: Telangana Congress: రాజ్యాంగం ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పు కేసీఆర్: బట్టి విక్రమార్క

ఈక్రమంలో.. టమోటా లోడుతో అనుమానాస్పదంగా వెళుతున్న మినీ వ్యాన్ ను పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో పైన టమోటా బుట్టలు… కింద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. లగేజీ ఆటోకు కింద భాగంలో రహస్యంగా క్యారేజీ ఏర్పాటు చేసి ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Also read: Patient Death: కంటి ఆపరేషన్ కోసం వస్తే శవాన్ని అప్పగించిన ఆసుపత్రి

ట్రెండింగ్ వార్తలు