Central Government : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదు : కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని చెప్పింది.

Central Government : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని చెప్పింది. ఈ మేరకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈ విషయంతో స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించే ప్రతిపాదనేది లేదని స్పష్టం చేసింది.

రాజ్యసభలో ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఉక్కు శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని చెప్పారు. ఉద్యోగుల ఆందోళనలు చేస్తున్న విషయం తమకు తెలుసన్నారు. 2021 జనవరి 27న కేబినెట్ తీసుకున్న నిర్ణయం విషయంలో ముఖ్యంగా వంద శాతం ప్రభుత్వ రంగ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించే నిర్ణయమేది లేదని స్పష్టం చేశారు.

Vizag Steel Plant : రూ.900కోట్ల లాభం.. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో మార్పు లేదు -తేల్చి చెప్పిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో వంద శాతం ప్రభుత్వ రంగ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేస్తునేవున్నారు. రెండేళ్లుగా ఉద్యమం కొనసాగుతూనేవుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఏ కోశానైనా ఉద్యోగుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదు. అనేక రాజకీయ పక్షాలు, వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.

కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తున్న కూడా కేంద్ర నిర్ణయంలో, వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఇవాళ సోమవారం కనక మేడల రవీంద్ర రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఇదే రీతిలో ఉక్కు శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంంలో ఎలాంటి పునరాలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్రం సమాధానంతో ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తారా? ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు