Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ కు ఎవరు అర్హులు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు.

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యాపార నిర్వహరణలో పాలుపంచుకునేందుకు ఆ సంస్థ గత మార్చి 27న జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) నోటీసులపై ఆసక్తి ఉన్న సంస్థలు ప్రతిపాదనలు సమర్పించేందుకు గడువు ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరు అర్హులు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరు అర్హులు అంటే..
– స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ముడిపదార్ధాలు అంటే ప్రధానంగా కోకింగ్ కోల్, బ్లాస్ట్ ఫర్నేస్ కోక్, ఇనుప ఖనిజం సరఫరా చేయగిలిగే సంస్థలు
– స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన నిర్వహణ మూలధనం సమకూర్చి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనే సంస్థలు

ప్రభుత్వరంగ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించవచ్చా?
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ (express of interest )లో అసలు ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రస్థావనే లేనందున కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఈ బిడ్డింగ్ ప్రక్రియకు వర్తించవు. అలా చూసినప్పుడు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వరంగ సంస్థలు ఏవైనా బిడ్ సమర్పించేందుకు సాంకేతికంగా ఆటంకాలు లేనట్టుగానే భావించాలి.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెలిక
స్టీల్ ప్లాంట్ జారీచేసిన ఈఓఐ నిబంధనల ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ దశలో అయినా ఏ కారణం చెప్పకుండా ఎవరి బిడ్ అయినా తిరస్కరించే పూర్తి హక్కు కలిగి ఉంటుంది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) యాజమాన్యం వద్దనుకుంటే ఈఓఐ ప్రాసెస్ అంతా హుష్ కాకే అవుతుంది.

ఈఓఐకి ప్రతిపాదనలు ఇచ్చేదెవరు?
ఈఓఐకి ప్రతిపాదనలు ఇచ్చేదెవరు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పినట్టుగా తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ ఏదైనా ప్రతిపాదన సమర్పిస్తుందా? ఏపీ ప్రభుత్వరంగ సంస్థ ఏదైనా బిడ్డింగ్ రేసులో ఉంటుందా? అదానీ గ్రూప్ (Adani Group) కూడా రేసులో ఉంటుందా.. టాటా, జిందాల్ గ్రూపులు ముందుకు వస్తాయా? ఊహించని రీతిలో ఊహించని సంస్థలు ఏవైనా ప్రతిపాదనలు ఇస్తాయా.. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ ఈఓఐకి జరుగుతున్న ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారటంతో ఎవరు బిడ్డింగ్ వేసినా, వేయకపోయినా ఇది ఆసక్తికర పరిణామంగానే భావించాల్సి ఉంటుంది.

Also Read: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం కీలక ప్రకటన

ట్రెండింగ్ వార్తలు