AP : సముద్రంలో ఏం జరుగుతోంది ? ముందుకు, వెనక్కు..భయాందోళనలో స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం స్థానికులను భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది, ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా ఉంది సముద్రం.

East West Godavari : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం స్థానికులను భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది, ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా ఉంది సముద్రం. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి. సముద్రం కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం .. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. ఇటు అంతర్వేదిలో అన్నాచెల్లెలి గట్టు వద్ద సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. మరో కొన్ని చోట్ల ఎడారి దీవులను తలపిస్తోంది.

Read More : Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే.. 642 రోజులు.. 50ఇన్నింగ్స్‌లు

పశ్చిమగోదావరి : –
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో సముద్రం వెనక్కు వెళ్లింది. బుధవారం సాయంత్రం మొగల్తూరు మండలం పేరుపాలెం, కుమ్మరిపురుగు పాలెం, చిన్న మైనివానిలంక, పెద్ద మైనివానిలంక గ్రామాల్లో 20 అడుగులు వెనక్కి వెళ్లింది సముద్రం. ఉదయం 7గంటల నుండి మళ్లీ ముందుకు వచ్చి నార్మల్ గా కనిపిస్తోంది. అనుహ్యంగా రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకుంటున్న మార్పులతో.. సముద్రం ఏదో హెచ్చరికలు జారీ చేస్తుందని అంటున్నారు మత్స్యకారులు.

Read More : IND vs ENG: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. 78 పరుగులకే ఆలౌట్!

అంతుచిక్కని మిస్టరీ : –
అంతుచిక్కని ఈ మిస్టరీ ఇప్పుడు శాస్త్రవేత్తలనూ కలవరపెడుతోంది. మొన్న బంగాళాఖాతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. నెల్లూరుకి మూడు వందల కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా చెన్నై తీరప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలిపారు అధికారులు. ఏపీ తీరంలో భూకంపం ఇప్పటివరకూ చూడలేదని అంటున్నారు ఏయూ ఓష్ణోగ్రపీ మెట్రాలజీ ప్రొఫెసర్ రామకృష్ణ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు