YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ మరోసారి పొడిగింపు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ ను సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది.

YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ ను సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది. జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగింది. గతంలో విధించిన ఈరోజుతో ముగియగా ఈ ఇద్దరినీ సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్బంగా వాదనలు విన్న సీబీఐ కోర్టు రిమాండ్ ను జూన్ 2 వరకు పొడిగించింది. దీనితో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.

వివేకా హత్య కేసులో కీలక నిందిడుగా ఉన్న వైఎష్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అనూహస్యంగా ఏప్రిల్ 16న పులివెందులలోనే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు తరలించి చంచల్ గూడ జైలులో ఉంచారు. ఈక్రమంలో బెయిల్ కోసం యత్నించినా ఫలితం లభించలేదు.భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేయటం హైదరాబాద్‌లో విచారణ అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత సీబీఐ మెజిస్ట్రేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపర్చగా ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు. నేటితో రిమాండ్ ముగియగా కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగించింది.

 

ట్రెండింగ్ వార్తలు