Apple Retail Stores : ఆపిల్ కొత్త రిటైల్ స్టోర్ సర్వీసు.. కస్టమర్లకు ఇకపై ఈజీగా హోం డెలివరీ.. ఎప్పటినుంచంటే?

Apple Retail Stores : ఆపిల్ రిటైల్ స్టోర్ల నుంచి కస్టమర్‌లు ఇకపై హోం డెలివరీ సర్వీసును సులభంగా పొందవచ్చు. కస్టమర్లు ప్రొడక్టులను కచ్చితంగా స్టోర్‌కు నుంచి కొనుగోలు చేయడమే ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.

Apple Retail Stores could soon support home delivery service

Apple Retail Stores : ఆపిల్ కస్టమర్లు స్టోర్ నుంచి కొనుగోలు చేసిన ప్రొడక్టులను ఇంటికి తీసుకెళ్లే సంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పనుంది. దానికి బదులుగా కస్టమర్లకు హోమ్ డెలివరీని అందించే దిశగా ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త రిటైల్ స్టోర్ సర్వీసును త్వరలోనే ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ సర్వీసు ద్వారా కంపెనీ రిటైల్ కార్యకలాపాలకు గణనీయమైన ప్రభావాలను కలిగించనుంది. ఆపిల్ యూజర్లకు నేరుగా సరుకులు అందించేలా ఈజీపే పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్‌లను వినియోగించుకునేలా లేటెస్ట్ స్టోర్‌లకు సాయపడుతుంది.

బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. కస్టమర్‌లు తాము కొనుగోలు చేయాలనుకున్న వాటితో కచ్చితంగా స్టోర్‌ నుంచి తీసుకెళ్లేలా ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్ హోమ్ షిప్పింగ్, ప్రొడక్టు వ్యక్తిగతీకరణతో సహా వివిధ పద్ధతులను ఒకే లావాదేవీపై అందించనుంది. ఈ ప్లాన్‌ని ఆపిల్ స్టోర్లలో ఆగస్టు నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. ఇంతకుముందు, ఆపిల్ స్టోర్ ఉద్యోగులు, కస్టమర్‌లు ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడం లేదా వెబ్‌సైట్‌లో ఆర్డర్‌లు పెట్టడం జరిగేది. కానీ, ఇప్పుడు ఈ కొత్త ప్రోగ్రామ్ హోమ్ షిప్పింగ్‌ను నేరుగా ఆపిల్ రిటైల్ EasyPay టెర్మినల్స్‌ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తుంది.

Read Also : Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డిస్కౌంట్.. రూ. 16వేలు తగ్గిందోచ్.. డోంట్ మిస్..!

పెరిగిన హోమ్ డెలివరీ అమ్మకాలతో ఆపిల్ అనేక ప్రయోజనాలను అందించనుంది. ముందుగా, స్టాక్ స్టోరేజ్‌కు కేటాయించిన స్థలాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ రిటైల్ స్టోర్‌లను మరిన్ని పెంచనుంది. రెండోది iMacs వంటి భారీ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే.. రిటైల్ స్టోర్ నుంచి కస్టమర్లు తాము కొనుగోలు చేసిన ప్రొడక్టులను నేరుగా తమ ఇళ్లకు షిప్పింగ్ చేసేలా ఎంచుకోవచ్చు.

Apple Retail Stores could soon support home delivery service

లేటెస్ట్ (EasyPay) ఆన్‌లైన్ ఆర్డరింగ్ ప్రోగ్రామ్ విజన్ ప్రో ద్వారా కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక పేర్కొంది. వ్యక్తిగత యూజర్లకు అనుగుణంగా అనేక అప్లియన్సెస్‌తో కూడిన కొత్త ఆపిల్ ప్రొడక్టులు, ఫిజికల్ స్టోర్లకు తగినంత స్టాక్‌ను నిర్వహించడం సవాలుగా ఉంటుంది. అయినప్పటికీ, షిప్పింగ్ డెలివరీ ఆప్షన్ సాయంతో ఆపిల్ స్టోర్‌లు ఇప్పటికీ కొన్నిచోట్ల అందుబాటులో లేకపోయినా Vision Pro ఆర్డర్‌లను పూర్తి చేయగలవు.

ప్రస్తుతానికి, ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి సంబంధించి ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌కు ముందే ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే.. వినియోగదారులు తమ కొనుగోళ్లను ఆపిల్ రిటైల్ స్టోర్ల ద్వారా ఇంట్లోనే స్వీకరించే అవకాశం ఉంటుంది. రాబోయే వారాల్లో ఈ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ద్వారా అందుబాటులోకి రానుంది.

Read Also : Flipkart Plus Premium : ఫ్లిప్‌కార్ట్‌‌లో ‘ప్లస్ ప్రీమియం’ మెంబర్‌షిప్.. ఈ కొత్త సర్వీసు పూర్తిగా ఉచితం.. త్వరలో భారత్‌లో లాంచ్..!

ట్రెండింగ్ వార్తలు