Apple Warn iPhone 15 Users : ఐఫోన్ 15 యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. ఆండ్రాయిడ్ ఛార్జర్లను పొరపాటున కూడా వాడొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!

Apple Warn iPhone 15 Users : ఐఫోన్ 15 యూజర్లకు ఆపిల్ హెచ్చరిక.. ఐఫోన్ ఛార్జింగ్ (iPhones Overheating) కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆండ్రాయిడ్ USB-C ఛార్జర్‌లను ఉపయోగించవద్దని వినియోగదారులను హెచ్చరించింది.

Apple warns iPhone 15 users not to use Android USB-C chargers : ఆపిల్ ఐఫోన్ 15 యూజర్లకు హెచ్చరిక.. కొత్త ఐఫోన్ 15 సిరీస్ కొనుగోలు చేసిన వినియోగదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆండ్రాయిడ్ USB-C ఛార్జర్లను వినియోగించరాదని గట్టిగా హెచ్చరిస్తోంది. గతంలో ఐఫోన్లకు లైటనింగ్ కేబుల్ ఛార్జర్ మాత్రమే సపోర్టు చేసేది. కానీ, ఇప్పుడు, ఆపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15)  ఫోన్లలో లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్-C పోర్టు సపోర్టు తీసుకొచ్చింది.

దాంతో చాలామంది ఐఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ ఛార్జింగ్ కేబుల్స్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే చైనాలోని యాపిల్ స్టోర్లు (Apple Stores) ఐఫోన్ 15 వినియోగదారులను తమ డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి ఆండ్రాయిడ్ USB-C కేబుల్‌లను ఉపయోగించరాదని హెచ్చరిస్తున్నాయి. థర్డ్-పార్టీ ఛార్జర్‌లను వాడటం కారణంగా ఐఫోన్ 15 డివైజ్ త్వరగా వేడెక్కడం వంటి సమస్యలు వస్తున్నాయని స్టోర్‌లు సూచిస్తున్నాయి.

ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్‌ (Apple iPhone 15 Series)ను యూనివర్సల్ టైప్-C ఇంటర్‌ఫేస్‌తో సహా గణనీయమైన మార్పులతో ప్రవేశపెట్టింది. ఈ చర్యతో ఐఫోన్ యూజర్లు (iPhone Users) తమ యాజమాన్య లైటనింగ్ ఛార్జింగ్ కేబుల్‌లకు స్వస్తి పలికి అన్ని ఆపిల్ డివైజ్‌లలో USB-C కేబుల్‌లను వినియోగించేందుకు ఆపిల్ అనుమతించింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు ఐఫోన్‌కి ఈజీగా మారిపోవచ్చు. అంతేకాదు.. 4 మోడళ్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. అయితే, లేటెస్ట్ ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఏదైనా మోడల్‌ను ఛార్జ్ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల కొత్త హీటింగ్ సమస్య తలెత్తుతుందని ఆపిల్ హెచ్చరిస్తోంది.

Apple warns iPhone 15 users not to use Android USB-C chargers

నిర్లక్ష్యంగా వాడితే.. ప్రాణాలకే ప్రమాదం :
గత మీడియా నివేదికల ప్రకారం.. చాలా మంది ఐఫోన్ 15 వినియోగదారులు ఆండ్రాయిడ్ ఛార్జర్ల (Android USB-C Chargers) ను వాడటం ద్వారా డివైజ్ వేడెక్కడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు ఫోన్ ఛార్జింగ్ సమయంలో స్ర్కీన్ టచ్‌ అసౌకర్యంగా వేడిగా మారుతుందని వివరించారు. ఈ ఆందోళనలను వివరిస్తూ.. చైనా నుంచి ఇటీవలి నివేదికలు దేశంలోని ఆపిల్ స్టోర్‌లు ఐఫోన్ 15 యూజర్లను తమ డివైజ్‌లకు ఆండ్రాయిడ్ యుఎస్‌బి-సి ఛార్జర్‌లను వాడొద్దని సూచిస్తున్నాయి. నిర్లక్ష్యంగా అలానే ఛార్జర్లను వాడటం ద్వారా డివైజ్ వేడెక్కడం వంటి సమస్యలతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 కావాలా? ఈ బ్లింకిట్ స్టోర్‌లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. 10 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఇప్పుడే కొనేసుకోండి..!

గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఫోషాన్‌లోని ఆపిల్ స్టోర్ ఐఫోన్ 15ని ఛార్జ్ చేయడానికి ఆండ్రాయిడ్ USB-C కేబుల్‌లను ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించినట్లు గిజ్మో చైనా రిపోర్టు పేర్కొంది. రెండు ఇంటర్‌ఫేస్‌ల వేర్వేరు పిన్ అమరికల కారణంగా డివైజ్ వేడెక్కడం జరుగుతుందని స్టోర్ సిబ్బంది చెబుతున్నారు. ఆపిల్ అందించేUSB-C కేబుల్‌తో పోలిస్తే.. సింగిల్-లైన్ 9-పిన్, సింగిల్-లైన్ 11-పిన్ కనెక్టర్‌ల మధ్య కొంచెం చిన్న గ్యాప్ కారణంగా ఆండ్రాయిడ్ కేబుల్‌ను ఉపయోగించడం వల్ల డివైజ్ వేడెక్కుతుందని స్టోర్ సిబ్బంది పేర్కొన్నారు.

Apple warns iPhone 15 users prevent overheating

ఆపిల్ సొంత యూఎస్‌బీ-C ఛార్జర్లను ప్రోత్సహిస్తుందా? :
ఈ హెచ్చరిక కేవలం ఒక్క ఆపిల్ స్టోర్ ద్వారా నుంచి మాత్రమే కాదు.. చైనీస్ పోర్టల్ CNMO నుంచి ఇటీవలి నివేదిక ప్రకారం.. చైనా అంతటా మల్టీ ఆపిల్-ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు ఇదే విధమైన హెచ్చరికను జారీ చేశాయి.ఈ సమస్యపై ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చైనా నుంచి నివేదికల ప్రకారం.. డివైజ్ భద్రతా సమస్యలను నిజంగా ప్రతిబింబిస్తుందా లేదా సంస్థ సొంత USB-Cని కొనుగోలుకు ఐఫోన్ 15 యూజర్లను ప్రోత్సహించే వ్యూహంలో భాగమా అనే చర్చ నడుస్తోంది. కొత్త ఐఫోన్లలో USB-C ఛార్జింగ్ కేబుల్స్ వినియోగానికి సంబంధించి ఆపిల్ నుంచి స్పష్టమైన సూచనలు లేవని కూడా పలువురు వినియోగదారులు ఎత్తి చూపుతున్నారు. ఆపిల్ అధికారిక గైడ్ ఆపిల్-బ్రాండెడ్ కేబుల్స్, ఛార్జింగ్ అడాప్టర్‌ల వినియోగాన్ని సూచిస్తోంది.

ఆపిల్ గైడ్ ఏం చెబుతుందంటే? :
Apple USB పవర్ అడాప్టర్ (విడిగా విక్రయం) ఉపయోగించి ఐఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయాలని సూచిస్తోంది. అయినప్పటికీ, నిర్దిష్ట ప్రమాణాలకు కట్టుబడి ఉండే థర్డ్-పార్టీ కేబుల్స్, పవర్ అడాప్టర్‌లను ఉపయోగించి యూజర్లుఐఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చని ఆపిల్ గైడ్ కూడా చెబుతోంది. ఈ ప్రమాణాలలో USB 2.0 లేదా తరువాతి ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం, వినియోగదారు దేశంలోని సంబంధిత భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండటం, అలాగే అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.

అయితే, ఆపిల్ ఏకకాలంలో అన్ని థర్డ్-పార్టీ ఎడాప్టర్‌లను ఈ సెక్యూరిటీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎడాప్టర్‌లను ఉపయోగించడం వల్ల యూజర్ భద్రతకు తీవ్రమైన పరిణామాలు కలగవచ్చునని హెచ్చరించింది. మీరు ఐఫోన్ కోసం రూపొందించిన USB 2.0 లేదా అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇతర థర్డ్ పార్టీ కేబుల్‌లు, పవర్ అడాప్టర్‌లతో కూడా ఐఫోన్ ఛార్జ్ చేయవచ్చు. ఇతర అడాప్టర్‌లు వర్తించే భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. అలాంటి ఎడాప్టర్లతో ఛార్జింగ్ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది.

Read Also : iPhone 15 Precision Finding : ఐఫోన్ 15 సిరీస్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. 60 మీటర్ల దూరంలోనూ మీ ఫ్రెండ్స్‌ను గుర్తించవచ్చు.. ఇదిగో ఇలా..!

ట్రెండింగ్ వార్తలు