AC Buying Guide 2023 : సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? కొనే ముందు ఈ 10 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!

AC Buying Guide 2023 : వేసవి కాలం వచ్చేస్తోంది.. సమ్మర్ సీజన్‌లో కొత్త ఏసీలను కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఉక్కపోతను తట్టుకోవాలంటే ఫ్యాన్ గాలి సరిపోదు.. ఏసీలు తప్పక ఉండాల్సిందే.. అందుకే చాలామంది వినియోగదారులు ఏసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు.

AC Buying Guide 2023 : వేసవి కాలం వచ్చేస్తోంది.. సమ్మర్ సీజన్‌లో కొత్త ఏసీలను కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఉక్కపోతను తట్టుకోవాలంటే ఫ్యాన్ గాలి సరిపోదు.. ఏసీలు తప్పక ఉండాల్సిందే.. అందుకే చాలామంది వినియోగదారులు ఏసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 54 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో మూడో అత్యంత హాటెస్ట్ డేగా నమోదైంది. వాతావరణంలో ప్రతిరోజూ వేడిగాలులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు కొత్త ఎయిర్ కండీషనర్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

ఎందుకంటే.. పనిమీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే చల్లని AC గాలిలో విశ్రాంతి తీసుకోవచ్చు. కొత్త AC కొనుగోలు చేయాలనుకుంటే.. మార్కెట్లో అనే ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఏ బ్రాండ్ ఎయిర్ కండీషనర్ బెటర్ అనేది తెలియక గందరగోళానికి గురవుతారు. మీరు కొనుగోలు చేసే ఏసీ మోడల్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే.. కొన్ని రకాల ఏసీలు చిన్న గదులలో మాత్రమే బాగా పనిచేస్తాయి. అదే, పెద్ద గదుల్లో మరో ఏసీ అవసరం పడొచ్చు. మీరు మీ కొత్త AC కొనుగోలు చేయడానికి ముందు ఈ 10 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం.. ఇక్కడ ఉన్నాయి.

AC Buying Guide 2023 : Here are 10 things you should keep in mind

మీ బడ్జెట్‌ పరిధిలోనే ఏసీ కొనండి :
మీరు నిర్ణయించుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే.. మీ AC కోసం ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరు ముందుగా సెట్ చేసిన బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అదే పరిధిలో అందుబాటులో ఉన్న ఏసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ బడ్జెట్ ధరలో ఎలాంటి ఏసీలు ఉన్నాయి అనేది గుర్తించడం సులభంగా ఉంటుంది. ఈ రోజుల్లో, సాధారణ ఏసీ ధర దాదాపు రూ.30వేల వరకు ఉంటుంది.

మీ పేమెంట్ ఆప్షన్లను తెలుసుకోండి :
మీరు ACని కొనుగోలు చేయడానికి క్యాష్ లేదా డెబిట్ కార్డ్ మాత్రమే మార్గం కాదని గమనించాలి. క్రెడిట్ కార్డ్‌లు, UPI వంటి ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది డీలర్లు మీకు No-Cost EMIతో ACని కొనుగోలు చేయడానికి అనుమతిస్తారు. మీరు 6 నెలలు లేదా ఒక ఏడాది వరకు వాయిదాల పద్ధతిలో పేమెంట్లు చేయవచ్చు. మీరు ఒకేసారి భారీ మొత్తాన్ని ఖర్చు చేయలేకపోతే.. ఇతర పేమెంట్ ఆప్షన్లను కూడా చెక్ చేయండి.

ఆన్‌లైన్‌లో ధరలను చెక్ చేయండి :
మీరు మీ ACని ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు వెళ్తే.. డీలర్ మీకు మోడల్‌ని సిఫార్సు చేస్తారు. అప్పుడు ఆ ఏసీ ధరను ఆన్‌లైన్‌లో చెక్ చేయడం మాత్రం గుర్తుంచుకోండి. అదే AC ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటే.. మీరు అదే విషయాన్ని విక్రయదారునికి చెప్పవచ్చు. మీకు సమానమైన ధరకు లేదా మెరుగైన డీల్‌ను అందించవచ్చు. తెలివిగా షాపింగ్ చేయడం అనేది నేర్చుకోండి.

Read Also : HP Omen 17 Gaming Laptop : హెచ్‌పీ నుంచి సరికొత్త ఒమెన్ గేమింగ్ ల్యాప్‌టాప్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర కూడా హైరేంజ్‌లోనే..

మీ ఇంటి గది పరిమాణం ఎంతో తెలుసుకోండి :
మీ ఇంట్లో భారీ హాలులో 1 టన్ను AC ప్రభావవంతంగా ఉండదని గమనించాలి. ఒక చిన్న గదిలో 2 టన్నుల AC చాలా చల్లగా ఉంటుంది. మీరు కొనుగోలు చేసేటప్పుడు మీ గది పరిమాణాన్ని గుర్తుంచుకోండి. సాధారణంగా 100 లేదా 120 చదరపు అడుగుల గదికి 1 టన్ను AC సరిపోతుంది. మీరు పెద్ద గదిని కలిగి ఉంటే.. 1.5 లేదా 2 టన్నుల యూనిట్ ఏసీని ఎంచుకోవచ్చు.

AC Buying Guide 2023 :  Here are 10 things you should keep in mind

మీ ఇంటి ఫ్లోర్ ఎక్కడ అనేది ముఖ్యం :
మీరు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటే.. AC కొనుగోలు చేసేటప్పుడు మీ ఇంటి అంతస్తు కూడా ముఖ్యమైనది. ఉదాహరణకు.. పైభాగంలోని అంతస్తు భవనం పైకప్పు కింద ఉన్నందున మరింత వేడిగా ఉంటుంది. అందువల్ల, మీరు పైఅంతస్తులో నివసిస్తుంటే.. మీకు కూలింగ్ కావాలంటే మీకు సాధారణం కన్నా పెద్ద, పవర్‌ఫుల్ AC అవసరం ఉంటుంది.

స్ప్లిట్ లేదా విండో.. ఏది బెస్ట్ ఎంచుకోండి :
సాధారణంగా.. స్ప్లిట్ లేదా విండో AC కూలింగ్ మధ్య చాలా తేడా ఉండదు. అయినప్పటికీ, స్ప్లిట్ ఏసీలతో పోల్చినప్పుడు.. విండో ఏసీలు కొంచెం చౌకగా ఉంటాయి. మరోవైపు, స్ప్లిట్ ఏసీలు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. అయితే, మీకు విండో ఏసీని అమర్చడానికి సరైన పరిమాణంలో విండో అవసరమని గుర్తుంచుకోండి. అంతేకాదు.. విద్యుత్ ఆదా, సౌండ్, కూలింగ్ సమయం కూడా తెలుసుకోవాలి. విండో ACలు ఎక్కువ పవర్ ఆదా చేస్తున్నప్పుడు.. స్ప్లిట్ ACలు ఎలాంటి సౌండ్ చేయవు. ఎక్కువ పరిమాణంలో చల్లని గాలిని బయటకు నెట్టడం వలన వేగంగా కూల్ అవుతాయి. మీ గది సామర్థ్యం, బడ్జెట్ ప్రకారమే మీరు రెండింటిలో ఏదైనా ఏసీని ఎంచుకోవచ్చు.

ఏసీలో కాయిల్ గురించి అడిగి తెలుసుకోండి :
చాలామంది వినియోగదారులు ఏసీని కొనే ముందు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. ACలో ఉపయోగించే కాయిల్ టైప్ గురించి అడగండి. రాగి కాయిల్ చాలా సులభంగా ఉంటుంది. రిఫేర్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అంతే వేగంగా కూల్ అవుతుంది. అల్యూమినియం కాయిల్ కన్నా ఎక్కువ లైఫ్ కలిగి ఉంటుంది.

AC Buying Guide 2023 : Here are 10 things you should keep in mind

ఏసీకి ఎన్ని స్టార్లు ఉన్నాయో చూడండి :
తక్కువ పవర్ సేవింగ్ రేటింగ్‌లను కలిగిన ACలు ఇతర ఆప్షన్ల కన్నా చౌకగా ఉండవచ్చు. అధిక విద్యుత్ బిల్లుల కారణంగా దీర్ఘకాలంలో మరింత ఖర్చును భరించాల్సి రావొచ్చు. మరోవైపు, అధిక విద్యుత్ సేవింగ్ రేటింగ్ ఉన్న ACలు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. కానీ, ఏసీలు చాలా తక్కువ పవర్ వినియోగించడం వలన చాలా డబ్బు ఆదా అవుతాయి. పవర్ సేవింగ్ పాయింట్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. యూనిట్‌లో ఎన్ని స్టార్లు ఉన్నాయో గమనించడం మర్చిపోవద్దు.

AC కొన్న తర్వాత సర్వీసు సపోర్టు ఉందా? :
మీ ఏసీని కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా సమస్య వస్తే సర్వీసు అవసరం పడుతుంది. ప్రతి నెలా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఏసీలో సమస్యలకు రిఫేర్లు చేయవలసి ఉంటుంది. మీరు డీల్ చేసే బ్రాండ్ సేల్స్ తర్వాత సర్వీసులను సక్రమంగా అందిస్తున్నాయా లేదో పూర్తిగా తెలుసుకోవాలి. మీరు AC కొనుగోలు చేయడానికి ముందు సేల్స్ తర్వాత సపోర్టు గురించి మీ డీలర్‌ను అడిగి తెలుసుకోండి.

మార్కెట్ జిమ్మిక్కులకు లొంగకండి :
ఏ బ్రాండ్ మార్కెటింగ్ జిమ్మిక్కులకు లొంగకండి. WiFi ద్వారా కంట్రోల్ చేసే ACలను కొనుగోలు చేయడంపై కాదు.. ఇతర ‘కూల్’ ఫీచర్‌లు ఏమైనా ఉన్నాయో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. కంట్రోలింగ్ వంటి ప్రైమరీ ఫంక్షన్‌ల గురించి పెద్దగా అవసరం లేదు. ఏసీ మన్నిక, పవర్ సేవింగ్, కూలింగ్ కెపాసిటీ ఎంత అనేది సేల్స్ తర్వాత సపోర్టు ఎలా ఉంటుంది అనే వాటిపై మరింత దృష్టి పెట్టండి.

Read Also : Indian IT company : మీ షిఫ్ట్ ఈజ్ ఓవర్.. చేసింది చాలు.. ఇక ఇళ్లకు పోండి.. కంప్యూటర్లకు లాకేసి ఉద్యోగులను ఇంటికి పంపుతున్న ఐటీ కంపెనీ.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు