Campa Cola Campaign : ఆర్సీపీఎల్ కాంపా కోలా సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్ ప్రారంభం..

ముంబైలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్‌లో కాంపా కోలా బాటిళ్లను ప్రదర్శించింది. ఈ క్యాంపెయన్ భారతీయులను వర్ణించే విభిన్నమైన విధానాన్ని సూచిస్తుంది.

Campaign for Campa Cola (Image Source : Press Note Pics )

Campa Cola Campaign : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లోని ఎఫ్ఎమ్‌సీజీ FMCG విభాగం పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఐకానిక్ డ్రింక్స్ బ్రాండ్ కంపా కోలా (Campa Cola) సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ముంబైలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్‌లో కాంపా కోలా బాటిళ్లను ప్రదర్శించింది. ఈ క్యాంపెయన్ భారతీయులను వర్ణించే విభిన్నమైన విధానాన్ని సూచిస్తుంది.

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీఈఈ కేతన్ మోడీ మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే భారతీయులకు సరసమైన ధరలకు గ్లోబల్ క్వాలిటీ ఉత్పత్తులను అందించడమే లక్ష్యం. ఆర్‌‌సీపీఎల్ సరఫరా గొలుసును మరింత బలోపేతం చేస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉత్పత్తుల పంపిణీని విస్తరిస్తోంది.

తద్వారా కంపెనీ కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. యాడ్ గురు ప్రసూన్ జోషిచే రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్ టీవీ, డిజిటల్, అవుట్‌డోర్, ప్రింట్‌లో మీడియా విస్తరణ ప్రణాళికతో ప్రారంభిస్తోంది’ అని పేర్కొన్నారు.

‘ఈ కొత్త క్రియేటివిటీతో బ్రాండ్ కాంపా కొత్త ఎమర్జింగ్ ఇండియాతో ముందుకు వస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు స్వదేశీ, ప్రతిభ కృతనిశ్చయంతో గర్వించేలా ఉంటుంది. ఈ కొత్త భారత్ దాహంతో ఉంది. ఆ దాహన్ని తీర్చడానికి ప్రత్యేకంగా ఏదైనా కావాలి’ అని మెక్‌కాన్ వరల్డ్‌గ్రూప్ రచయిత, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ప్రసూన్ జోషి అన్నారు. చిత్ర నిర్మాత, అరుణ్ గోపాలన్, సింగర్-కంపోజర్, శంకర్ మహదేవన్‌ల సహకారంతో ఈ ఫిల్మ్‌కు జోషి సాహిత్యం అందించారు.

Read Also : Airtel Free Netflix Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!