BSE Stock Markets : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగానే దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది.

BSE Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం (డిసెంబర్ 6) కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగానే దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ఒమిక్రాన్ భయాలతో దేశీయ సూచీలు ఉదయం నుంచి భారీ నష్టాలతో కొనసాగాయి. ఆర్థిక వ్యవస్థలపై మళ్లీ ఆందోళన మొదలైన నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 949 పాయింట్లు కోల్పోయింది. తద్వారా సెన్సెక్స్ 56,747 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ కూడా 284 పాయింట్లు క్షీణించి 16,912 వద్ద స్థిరపడింది.

బెంచ్‌మార్క్ సూచీలు రెండోరోజూ కూడా నష్టాల బాటపట్టాయి. నిఫ్టీ సెన్సెక్స్ ఒక్కొక్కటి -1.6శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి. నిఫ్టీ 17వేల స్థాయి దిగువన ముగిసింది. కీలక బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల బాటపట్టాయి. IT FMCG స్టాక్‌లలో బలహీనపడి ఇంట్రా-డే కనిష్టాలను నమోదు చేశాయి.

దేశంలో 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం.. ఐరోపా, ఆఫ్రికా వంటి దేశాల్లో కొవిడ్‌ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధించడం వంటి ఆర్థిక ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్​ను దెబ్బకొట్టాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లు సైతం అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా మార్కెట్లన్నీ నష్టాలను చవిచూశాయి.

Read Also : Wasim Rizvi : ఇస్లాం వదిలి..హిందూ మతంలోకి యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్

ట్రెండింగ్ వార్తలు