Flipkart Big Dusshera Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Flipkart Big Dusshera Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సందర్భంగా iPhone 14, Samsung Galaxy F54, Motorola Edge 40, Poco C51 ఇతర ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Dusshera Sale _ Big discount on iPhone 14, Samsung Galaxy F54, Full Details in Telugu

Flipkart Big Dusshera Sale : కొత్త ఫోన్ కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయం.. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం సైట్‌ ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big Dusshera Sale) బిగ్ దసరా సేల్ ఇప్పుడు ప్రారంభమైంది. అమెజాన్ దీపావళి సేల్‌ను ఒక నెల పాటు నిర్వహించగా.. ఫ్లిప్‌కార్ట్ దీపావళికి ముందు ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డీల్స్ అందిస్తోంది.

అనేక సేల్ ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. ఇప్పుడు, లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ సేల్, iPhone 14, Samsung Galaxy F54, Motorola Edge 40, Poco C51, ఇతర ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్ డీల్‌లను పొందవచ్చు.

Read Also : Amazon Festival Sale : అమెజాన్‌లో స్పెషల్ ‘ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్’ సేల్.. టాప్ బ్రాండ్‌ల ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై అదిరే డీల్స్..!

ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఐఫోన్ 14, గెలాక్సీ F54పై డీల్స్ :
ఐఫోన్ 14 తగ్గింపు ధర రూ. 56,999కి అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ. 69,900 కన్నా చాలా తక్కువ. 10 శాతం బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. భారత మార్కెట్లో రూ.29,999కి లాంచ్ అయిన (Samsung Galaxy F54) ప్రారంభ ధర రూ.24,999తో అమ్మకానికి ఉంది. పిక్సెల్ 7a (Pixel 7a) కూడా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సమయంలో రూ. 35,999కి పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 43,999 నుంచి తగ్గింది. అంటే.. ఈ పిక్సెల్ ఫోన్‌పై కొనుగోలుదారులు రూ. 8వేల తగ్గింపును పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ధర రూ. 26,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే, (Motorola Edge 40 Neo) ఫోన్ ధర రూ. 22,999, నథింగ్ ఫోన్ (2) కూడా సేల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర తాత్కాలికంగా రూ. 39,999కి పడిపోయింది.

Flipkart Big Dusshera Sale

రూ. 10వేల లోపు బడ్జెట్‌ ఫోన్లు ఇవే :
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో (Poco X5 Pro) ధర రూ. 18,499 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. రెడ్‌మి నోట్ 12ప్రో (Redmi Note 12 Pro) తక్కువ ధరకు రూ. 21,999 కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 5,999కి అందుబాటులో ఉంది. రూ. 10వేల లోపు బడ్జెట్ ఉన్నవారు (Poco C51)ని కొనుగోలు చేయొచ్చు. బడ్జెట్ ఫోన్ మొదట రూ.8,499కి అందుబాటులోకి వచ్చింది.

ఉదాహరణకు, Pixel 7a అనేది మంచి కెమెరా పనితీరును అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 40 అనేది ధర పరిధిలో మంచి డిజైన్, స్పెక్స్‌తో కూడిన ఆల్ రౌండర్ ఫోన్. Samsung, iPhone అభిమానులు తమకు ఇష్టమైన ఫోన్‌ని ఎంచుకోవచ్చు. లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని గుర్తుంచుకోండి.

Read Also : Unlock Amazon Account : మీ అమెజాన్ అకౌంట్ లాక్ అయిందా? పాస్‌వర్డ్ లేకుండానే ఇలా ఈజీగా అన్‌లాక్ చేసుకోవచ్చు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు