Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అదిరిపోయే శుభవార్త.. మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి.

Gold price

Gold and Silver Prices Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అదిరిపోయే శుభవార్త.. మరోసారి బంగారం ధరలు తగ్గాయి. వరుసగా ఐదోరోజు బంగారం ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది. అమెరికా డాలర్ రేట్లు పెరగడం, సురక్షితమైన డిమాండ్ లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా ఆరు నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోయాయి. మరోవైపు.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో గోల్డ్ ధరలు భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చేది పండుగల సీజన్ కావడం, బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో.. ధరలుసైతం రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరియైన సమయం అని అభిప్రాయ పడుతున్నారు.

Gold

బంగారం ధరలు వరుసగా ఐదోరోజు తగ్గాయి. ఆదివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 300 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 330 తగ్గుదల చోటుచేసుకుంది. వెండి ధరకూడా తగ్గింది. కిలో వెండిపై రూ. 1500 తగ్గుదల చోటు చేసుకుంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు..
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదోరోజు బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఐదు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 1600 మేర తగ్గుదల చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. ఆదివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,350కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,200గా నమోదైంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,350
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,600 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,470.
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 53,350 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,200.
– కోల్‌కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,350 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,200.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,350కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,200 వద్దకు చేరింది.

Gold

వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై రూ. 1500 తగ్గుదల చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,000 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో రూ. 73,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి 73,500 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు