Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నాలుగురోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర..? దుకాణాల్లో కొనుగోళ్ల జోష్
కొద్దిరోజుల్లో పండుగ సీజన్ ప్రారంభంకానున్న వేళ బంగారం ధర ఒక్కసారిగా తగ్గడంతో మధ్య తరగతి ప్రజలు గోల్డ్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో
- Harishth Thanniru
- Published On : July 27, 2024 / 10:29 AM IST
Gold And Silver Price Today
Gold and Silver Price Today : కేంద్ర బడ్జెట్ తరువాత బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. 10గ్రాముల బంగారం ధర దాదాపు రూ.5 నుంచి రూ.6వేలు దిగొచ్చింది. బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడమే బంగారం ధరల తగ్గుదలకు కారణం. కొద్దిరోజుల్లో పండుగ సీజన్ ప్రారంభంకానున్న వేళ బంగారం ధర ఒక్కసారిగా తగ్గడంతో మధ్య తరగతి ప్రజలు గోల్డ్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారుతున్నాయి. వెండి ధరసైతం భారీపెరిగింది. నాలుగు రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ.11వేలు తగ్గింది. అయితే, ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల తరువాత బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిద్దాం.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10గ్రాముల బంగారంపై రూ. 270 పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,250 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.69,000. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.63,400 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,150.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.63,250 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,000.
చెన్నైలో బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,650 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,530 కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 89,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.89,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 84,250 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
