ITR-1 vs ITR-2 : ఒకటికి మించి ఇళ్లు ఉన్నాయా? ITR-1 లేదా ITR-2 ఏది ఎంచుకోవాలి? పూర్తి రూల్స్, ఫైలింగ్ ప్రాసెస్
ITR-1 vs ITR-2 : ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్నవారు.. క్యాపిటల్ గెయిన్స్ పొందేవారు, విదేశాలలో ఆస్తి ఉన్నవారు లేదా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నవారికి ITR-2 ఫారం అవసరం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి? రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ITR-1 vs ITR-2
- 2 ఇళ్లు ఉంటే ITR-1 లేదా ITR-2 ఏ ఫారమ్ తప్పనిసరి
- రెండు ఇళ్లు ఉన్నవారికి ఏది బెస్ట్? ట్యాక్స్ రూల్స్ మారతాయా?
- ITR-1, ITR-2లో కన్ఫ్యూజన్ ఉందా? రెండు ఇళ్లు ఉంటే ఇది తప్పక చదవండి
- రెండు ఇళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఐటీఆర్ రూల్స్
ITR-1 vs ITR-2 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. చాలా మంది ఇప్పటికే తమ ఐటీఆర్ దాఖలు చేశారు. అయితే మరికొందరు ITR-1, ITR-2 విషయంలో ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
మీరు కూడా ఈ ఫారమ్‌లను నింపాలా? వద్దా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. మీ ఆదాయం కేవలం జీతం నుంచి మాత్రమే వస్తే ఏ ఫారమ్ నింపాలి? మీకు ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లు ఉంటే ఏ ఫారమ్ నింపాలి? క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చే ఆదాయం కోసం ఏ ఫారమ్ నింపాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ITR-1 ఎప్పుడు దాఖలు చేయాలి? :
మీరు కేవలం జీతం రూపంలో మాత్రమే ఆదాయం పొందుతుంటే.. ఒకే ఒక ఇల్లు ఉండి మీ మొత్తం ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉంటే.. క్యాపిటల్ గెయిన్స్ విదేశీ ఆదాయం ఏది లేకపోతే మీరు సహజ్ ఫారం నింపాల్సి ఉంటుంది.
ITR-2 ఎవరికి అవసరమంటే? :
- మీకు ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లు ఉంటే.. వాటి ద్వారా ఆదాయం వస్తున్నా రాకున్నా ఈ ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది.
- మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 50 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఫారమ్‌ను ఎంచుకోవాలి.
- షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఆస్తి లేదా గోల్డ్ అమ్మడం ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పొందితే ఈ ఆప్షన్ కూడా ఎంచుకోవాలి.
- క్యాపిటల్ గెయిన్స్ లేదా నష్టం వచ్చినప్పుడల్లా మీరు ITR-2ని మాత్రమే ఎంచుకోవాలి.
- మీకు విదేశాలలో ఆస్తి ఉంటే.. విదేశీ ఆస్తి నుంచి ఆదాయం పొందుతున్నా ఇది ఎంచుకోండి.
- వ్యవసాయం నుంచి మీ ఆదాయం రూ. 5వేల కన్నా ఎక్కువగా ఉన్నా ఆప్షన్ ఎంచుకోండి.
- లిస్టులో లేని కంపెనీలో వాటాదారు అయినా లేదా ఆ కంపెనీకి డైరెక్టర్ లేదా బోర్డు సభ్యులు అయినా ఈ ఫారమ్‌ను ఎంచుకోండి.
- మీరు వ్యాపారం ద్వారా ఆదాయం పొందితే ఈ ఫారం నింపాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
ITR-2 ఎలా ఫైల్ చేయాలంటే? :
- ఆన్లైన్లో ఐటీఆర్ దాఖలుకు ఇ-ఫైలింగ్ పోర్టల్ విజిట్ చేయాలి.
- మీ పాన్ నంబర్, పాస్వర్డ్ సాయంతో ఈజీగా లాగిన్ అవ్వొచ్చు.
- లాగిన్ అయ్యాక ఫైల్ ఆప్షన్‌కు వెళ్తే.. మీకు ఐటీ రిటర్న్ ఆప్షన్ కనిపిస్తుంది.
- ఇందులో ‘ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆపై అసెస్మెంట్ ఇయర్ ఎంచుకోండి.
- సిస్టమ్ డేటాకు మ్యాచ్ అయ్యేలా పూర్తి వివరాలను ఇవ్వండి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు సమాచారం ఇవ్వొద్దు.
- ఐటీఆర్ దాఖలు సమయంలో అన్ని వివరాలను సరిచూసుకోవడం మరవొద్దు.
