Honda Elevate Bookings : హోండా ఎలివేట్ బుకింగ్స్ చేసుకున్నారా? మీ బుకింగ్ రద్దు చేస్తే.. 100 శాతం రీఫండ్ గ్యారెంటీ..! 

Honda Elevate Bookings : హోండా ఎలివేట్ కోసం ముందుగానే బుకింగ్ చేసుకున్నారా? ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. 

Honda Elevate unofficial bookings already underway, dealers promise 100 Percent refund on cancellation

Honda Elevate Bookings : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా నుంచి సరికొత్త హోండా ఎలివేట్ కారు భారత మార్కెట్లోకి రానుంది. అయితే, ఈ హోండా ఎలివేట్ కారు కోసం ముందుగానే బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ అనధికారిక బుకింగ్‌లు రూ. 21వేలు టోకెన్ మొత్తానికి బుకింగ్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి పోటీదారులు అధికారిక బుకింగ్‌లను ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ క్రమంలో అనేక మంది హోండా డీలర్లు.. కొనుగోలుదారు బుకింగ్‌ను రద్దు చేస్తే.. చెల్లించిన మొత్తం రూ. 21వేలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కారు బుకింగ్ రద్దు చేసుకున్నా మీరు చెల్లించిన మొత్తాన్ని డీలర్లు రీఫండ్ చేస్తామని ప్రకటించారు.

మరోవైపు.. ఎలివేట్ కారు అధికారిక బుకింగ్‌లు జూలై మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. హోండా ఎలివేట్ ఆగస్ట్ నుంచి డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది. అప్పుడే హోండా ఎలివేట్ ధరలను ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. హోండా ఎలివేట్ కార్ల ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా. హోండా ఎలివేట్ జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ప్రపంచ ప్రీమియర్‌లో పండుగ సీజన్‌లో ఈ కొత్త కారు లాంచ్ చేయనున్నట్లు హోండా కంపెనీ తెలిపింది. ఈ మిడ్-సైజ్ SUVని ప్రవేశపెట్టిన మొదటి మార్కెట్ భారత్ కానుంది.

Read Also : Jio Cheapest 5G Phone : భారత్‌లోనే అత్యంత చౌకైన జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ముఖేష్ అంబానీ ప్లాన్ అదిరింది..!

అంతేకాకుండా, ఎలివేట్ కారు 5 SUVలలో మొదటిది. ఇందులో హోండా 2030 నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఎలివేట్ ఆధారంగా సింగిల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) మూడు సంవత్సరాలలో భారత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. హోండా ఎలివేట్‌లో 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్ ఉంది. 121PS, 145Nm అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ ఉన్నాయి. ఎలివేట్ కారులో ఎలాంటి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఉండదు.

Honda Elevate Bookings already underway, dealers promise 100 Percent refund on cancellation

హోండా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ మాట్లాడుతూ.. ఎలివేట్ విషయంలో కంపెనీ పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్‌కు నేరుగా మారాలని భావిస్తుందని తెలిపారు. హోండా ఎలివేట్ ముఖ్యమైన ఫీచర్లలో LED హెడ్‌లైట్లు టెయిల్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల HD కలర్ TFT MID, 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హోండా సెన్సింగ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉన్నాయి. ఎలివేట్ కారు 4,312 మిమీ పొడవు, 1,790 మిమీ వెడల్పు, 1,650 మిమీ పొడవు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 220mm కాగా, వీల్ బేస్ 2,650mm, భారీ 458-లీటర్ బూట్ ఉంది.

Read Also : Samsung Galaxy S21 FE 5G : సరికొత్త ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు