Kia Seltos 2023 Bookings : కొత్త కారు కొంటున్నారా? మిడ్ సైజ్ SUV కియా సెల్టోస్ 2023 రికార్డు.. కేవలం 2 నెలల్లోనే 50వేల బుకింగ్స్..!

Kia Seltos 2023 Bookings : మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం చెలాయించగా, కొత్త కియా సెల్టోస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో రెండో స్థానానికి దూసుకుపోతోంది.

Kia Seltos 2023 Bookings : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ కొత్త కియా సెల్టోస్ 2023 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మిడ్ సైజ్ SUV కియా సెల్టోస్ బుకింగ్స్ కేవలం 2 నెలల్లోనే 50వేల మైలురాయిని దాటింది. కియా ఇండియా ప్రకారం.. మిడ్-సైజ్ SUV ప్రతిరోజు 806 కొత్త బుకింగ్‌లను పొందింది. HTX నుంచి టాప్ ట్రిమ్‌లకు అనుకూలంగా 77శాతం ఆర్డర్‌లు వచ్చాయి. కొత్త సెల్టోస్ బుకింగ్‌లు జూలై 14న ప్రారంభమైనప్పటికీ, మిడ్-సైజ్ SUV జూలై 21న లాంచ్ అయింది. సెల్టోస్ 2023 జూలై 4న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది.

Read Also : Jio AirFiber Services : జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసిందోచ్.. 8 నగరాల్లో అందుబాటులోకి.. కేబుల్ లేకుండా అల్ట్రా హైస్పీడ్ సర్వీసులు.. పూర్తి వివరాలు మీకోసం..!

రూ. 10,89,900, రూ. 19,99,900 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్న కియా సెల్టోస్ హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. మిడ్-సైజ్ SUV విభాగంలో క్రెటా ఆధిపత్యం చెలాయించగా, కొత్త సెల్టోస్ గ్రాండ్ విటారాతో రెండో స్థానానికి దూసుకుపోతోంది.

Kia Seltos 2023 Bookings garners over 50,000 bookings in 2 months

సెల్టోస్ 2023 గ్రాండ్ విటారా 9,079 యూనిట్ల నుంచి జూలైలో 9,740 యూనిట్ల వాల్యూమ్‌ను నమోదు చేసింది. అయినప్పటికీ, సెల్టోస్ 2023 10,698 యూనిట్లతో పోల్చితే.. ఆగస్ట్‌లో గ్రాండ్ విటారా 11,818 యూనిట్లకు మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తోంది. కొత్త సెల్టోస్ బుకింగ్‌లలో 47శాతం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో కూడిన వేరియంట్‌లు ఉన్నాయని కియా పేర్కొంది.

కొత్త సెల్టోస్‌లో 3 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. Smartstream 1.5-లీటర్ టర్బో-GDi పెట్రోల్ (160PS/253Nm), Smartstream 1.5-లీటర్ NA పెట్రోల్ (115PS/144Nm),Smartstream 1.5-లీటర్ CRDi VGT డీజిల్ (116PS/250Nm) ఉన్నాయి.

టర్బో పెట్రోల్ యూనిట్‌ను 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCTతో NA పెట్రోల్ యూనిట్‌ను 6-స్పీడ్ MT లేదా IVTతో డీజిల్ యూనిట్‌ను 6-స్పీడ్ iMT లేదా 6-స్పీడ్‌తో AT అందిస్తుంది. ఆగస్టు 2019లో లాంచ్ అయినప్పటి నుంచి కియా దేశీయ విపణిలో సెల్టోస్ 4లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ కార్‌మేకర్ మిడ్-సైజ్ SUV 1,47,000 యూనిట్లను ఎగుమతి చేసింది.

Read Also : Apple iPhone 15 Offers : ఆపిల్ ఐఫోన్ 15 కొనేందుకు చూస్తున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు