Microsoft Employee : ఏడాదిన్నరకే ఉద్యోగం కోల్పోయిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి.. కెరీర్‌లో ముచ్చటగా మూడోసారట..!

Microsoft Employee : మైక్రోసాఫ్ట్‌లో ఏడాదిన్నర పాటు పనిచేస్తున్న మహిళ, ఇటీవలే తనను తొలగించారని, తన కెరీర్‌లో మూడవ లేఆఫ్ అని తెలిపింది.

Microsoft employee loses job after a year of service, says this is the third layoff in her career

Microsoft Employee : టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులను ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగాల్లో నుంచి పీకి పారేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మెటా నుంచి ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వరకు టెక్ దిగ్గజాలు గత కొన్ని నెలలుగా వివిధ కారణాలను చూపుతూ మిలియన్ల మంది టెక్కీలకు పింక్ స్లిప్‌ను అందజేశారు. ఇటీవలి మైక్రోసాఫ్ట్ లేఆఫ్ రౌండ్ గత వారమే నిర్వహించింది. దాదాపు 276 మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. చాలా మంది తొలగించిన ఉద్యోగులు Linkedin వేదికగా తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.

కెరీర్‌లోనే ఇది మూడోసారి :
మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల్లో మహిళ ఉద్యోగి ఒకరు (Linkedin) వేదికగా తన కెరీర్ ప్రారంభం నుంచి మూడో తొలగింపుగా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌లో ఏడాదిన్నర పాటు పనిచేస్తున్న మహిళ.. ఇటీవలే తనను తొలగించారని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌లో విభిన్న, ప్రతిభావంతులైన వ్యక్తులను కలిసే అద్భుతమైన అవకాశాన్ని పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె పేర్కొంది. తన కెరీర్‌లో ఉద్యోగం నుంచి తొలగించడం ఇది మూడోసారిగా తెలిపింది.

Read Also : Contactless Cards : మీ డెబిట్, క్రెడిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ అని తెలుసా? ఎలాంటి టెక్నాలజీ వాడారు? NFC పేమెంట్ సురక్షితమేనా? పూర్తి వివరాలు మీకోసం..!

కంపెనీ దివాలా తీయడం వల్ల తన మొదటి లేఆఫ్ జరిగిందని పేర్కొంది. రెండో తొలగింపు అనేది కోవిడ్-19 కారణంగా జరిగింది. దురదృష్టవశాత్తూ.. తన ఉద్యోగ వృత్తిలో 3 సార్లు తొలగింపులను ఎదుర్కొన్నానని వాపోయింది. అయినప్పటికీ, ఆమె సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంది. ప్రతి తొలగింపు తర్వాత కొత్త ప్రయాణంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగినట్టు చెప్పుకొచ్చింది. మరో కొత్త ప్రయాణం దిశగా తన జీవితాన్ని కొనసాగిస్తానని విశ్వాసంతో తెలిపింది.

Microsoft employee loses job after a year of service, says this is the third layoff in her career

దశాబ్దం తర్వాత మూడో ఉద్యోగం :
మైక్రోసాఫ్ట్ పలువురు సీనియర్ ఉద్యోగులను కూడా తొలగించింది. అందులో మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లి కంపెనీలో దశాబ్దం పూర్తి చేసిన తర్వాత తన ఉద్యోగాన్ని ఎలా పోగొట్టుకున్నారో తన అనుభవాలను షేర్ చేసుకుంది. అయినప్పటికీ, మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో కంపెనీని ప్రశంసించింది. కంపెనీ పట్ల తనపై ఎలాంటి ద్వేషం లేదని తెలిపింది. ఆ మహిళ 2013 నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్‌లో పనిచేస్తోంది. తనతో పాటు కలిచిన పనిచేసిన సహోద్యోగులు, నిర్వాహకుల నుంచి సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నానని తెలిపింది.

మైక్రోసాఫ్ట్ తొలగింపులు :
గత వారమే మైక్రోసాఫ్ట్ అమెరికాలోని వాషింగ్టన్‌లో 276 మందిని తొలగించింది. గీక్‌వైర్ నివేదిక ప్రకారం.. తొలగించిన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించింది. ప్రభావితమైన విభాగాలలో కస్టమర్ సర్వీసు, సపోర్టు స్టాప్,అమ్మకాలు ఉన్నాయి. తొలగించిన ఉద్యోగులలో 66 మంది వాస్తవంగా పనిచేస్తున్నారు. అంతకుముందు, ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also : Experts Warn Game Addiction : పిల్లల్లో గేమింగ్ వ్యసనం.. పేరంట్స్ ఇంటర్నెట్ ఆపేస్తే.. Wi-Fi కోసం రాత్రిళ్లూ ఇళ్లలో నుంచి పారిపోతున్నారు..!

ట్రెండింగ్ వార్తలు