IND vs PAK : ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్.. మనోళ్లు సత్తాచాటేనా..

ఆసియా కప్ -2024 టోర్నీలో భారత్ జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్ లు ఆడుతుంది. తొలి మ్యాచ్ ఇవాళ పాకిస్థాన్ తో తలపడనుంది. జూలై 21న ఆదివారం యూఏఈ జట్టుతో...

IND vs PAK Match

Womens Asia Cup-2024 IND vs PAK Match : మహిళల ఆసియా కప్ -2024 టీ20 టోర్నమెంట్ కు సమయం ఆసన్నమైంది. ఇవాళ్టి నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జట్టు గ్రూప్-ఏలో తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్లుతో ఇవాళ తలపడనుంది. రాత్రి 7గంటలకు మ్యాచ్ జరుగుతుంది. చివరిసారిగా ఈ ఏడాది జూన్ నెలలో ఇరుజట్లు టీ20 ప్రపంచకప్ లో తలపడ్డాయి. ప్రతీసారిలాగే ఈసారి కూడా భారత్ – పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ ఉంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Also Read : IND vs SL : శ్రీలంక ప‌ర్య‌ట‌న భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. టీ20ల్లో కెప్టెన్‌గా సూర్య‌కుమార్‌, వ‌న్డే జ‌ట్టులో శ్రేయాస్‌కు చోటు.. గంభీర్ మార్క్..

మహిళల ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఏ, బీ గ్రూప్ లుగా విడిపోయి తలపడుతున్నాయి. ప్రతి టీం తమ గ్రూప్ లో మిగిలిన టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో తొలి మ్యాచ్ నేపాల్, యూఏఈ మహిళా జట్ల మధ్య మధ్యాహ్నం 2గంటలకు జరుగుతుంది. రెండో మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దంబుల్లాలోని రాంగిదంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

Also Read : Hardik Pandya : నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు.. ఇన్‌స్టా పోస్టుతో వెల్ల‌డి..

హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ జట్టు ఆసియాకప్ లోనూ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అదిరే ఫామ్ లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. పాకిస్థాన్ పై భారత్ జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరిగాయి. అందులో భారత్ జట్టు 11 గెలిచింది.

గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్
గ్రూప్-బిలో శ్రీలం, మలేషియా, థాయ్ లాండ్, బంగ్లాదేశ్.

భారత్ జట్టు షెడ్యూల్ ..
ఈ టోర్నీలో భారత్ జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్ లు ఆడుతుంది. తొలి మ్యాచ్ ఇవాళ పాకిస్థాన్ తో తలపడనుంది. జూలై 21న ఆదివారం యూఏఈ జట్టుతో, జూలై 23న మంగళవారం నేపాల్ జట్టుతో భారత్ జట్టు తలపడనుంది.

 

ట్రెండింగ్ వార్తలు